Begin typing your search above and press return to search.

దేవర.. బీ టౌన్ కోసం అదే ఆయుధంగా!

అయితే మూవీ అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన దేవర నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2024 10:30 AM GMT
దేవర.. బీ టౌన్ కోసం అదే ఆయుధంగా!
X

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఆ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తారక్ ను చూసేందుకు చాలా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఫుల్ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన హీరోను చూసి ఈలలు వేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే మూవీ అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన దేవర నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ డేట్ కు 23 రోజులే మిగిలి ఉండటం వల్ల.. సినీ ప్రియులు అంతా ట్రైలర్ ఎప్పుడు వస్తుందోనని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం దేవర మేకర్స్ కూడా ట్రైలర్ ను కట్ చేసే పనిలో ఉన్నారని టాక్.

అద్బుతమైన విజువల్స్, భారీ యాక్షన్, డైలాగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా యాడ్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 10వ తేదీ లేదా 11వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ట్రైలర్ తో హిందీ ఆడియన్స్ దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకునేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న దేవర మూవీ.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. సినిమా వసూళ్లు కూడా భారీగా ఉండాలంటే.. నార్త్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధించాలి. అలా జరగాలంటే.. మేకర్స్ తమ ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించాలి. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలి.

అందుకే ఇప్పుడు ట్రైలర్ ను పెద్ద ఆయుధంగా మేకర్స్ మలుచుకున్నారని తెలుస్తోంది. మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా.. దేవర మూవీ నేపథ్యం తెలిసినప్పటికీ స్టోరీ లైన్ పై ఎవరికీ క్లారిటీ లేదు. మెయిన్ స్టోరీ లైన్ ను ఇప్పటి వరకు రివీల్ అవ్వలేదు. ఏదేమైనప్పటికీ.. ట్రైలర్ క్లిక్ అయితే చాలు.. దేవర పార్ట్-1 వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.