Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌తో ఈ హీరో పోటీనా?

దీంతో దేవ‌ర వ‌ర్సెస్ స‌త్యం సుంద‌రం ఫైట్ ఇప్పుడు అధికారికంగా మారింది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 9:30 AM GMT
ఎన్టీఆర్‌తో ఈ హీరో పోటీనా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ నటించిన 'దేవర' 2024 మోస్ట్‌ ఎవైటెడ్‌ సినిమాల్లో ఒకటి. పాటలు విడుదలైన తర్వాత ఈ చిత్రం అంచనాలను భారీగా పెంచుతోంది. దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి దేవ‌ర‌కు వేరొక సినిమా ఏదీ పోటీకి రావ‌డం లేద‌ని భావించారు.. కానీ ఇప్పుడు కార్తీ మాత్రం ఎన్టీఆర్‌తో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. త‌మిళనాడులో దేవ‌ర‌కు కార్తీ న‌టించిన సినిమా పోటీకి రానుంది.

కార్తీ, అరవింద్ స్వామి నటించిన మెయ్యళగన్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. దీంతో దేవ‌ర వ‌ర్సెస్ స‌త్యం సుంద‌రం ఫైట్ ఇప్పుడు అధికారికంగా మారింది. ఈ చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. కార్తీ- అరవింద్ స్వామి కలయికలో ఇది వ‌స్తోంది. సూర్య, జ్యోతిక తమ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు.

దేవర కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంది. కాబట్టి దాని తమిళ వెర్షన్‌కి తమిళనాడులో డైరెక్ట్ క్లాష్ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ త‌మిళ‌నాడులోను విజయం సాధించ‌డంతో దేవరకు త‌మిళ‌ రాష్ట్రంలో కూడా క్రేజ్ ఉంది. దేవర ట్రైలర్ కూడా సెప్టెంబర్ 10 న విడుదల అవుతుంది. ప్రస్తుత క్లాష్ లో తంబీల రాష్ట్రంలో దేవ‌ర ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ ఎవ‌రూ ఎన్టీఆర్ హ‌వాను ఆప‌డం అసాధ్యం. ఇక ఓవ‌ర్సీస్ లోను దేవ‌ర‌కు అద్భుత‌మైన క్రేజ్ నెల‌కొంద‌ని ఇప్ప‌టికే టికెట్ ప్రీసేల్ చెబుతోంది.