Begin typing your search above and press return to search.

కాంతారా స్టార్ తో దేవర.. వైరల్ క్లిక్

అందుకే కర్ణాటకలో ఎక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ కి ఘన స్వాగతం లభిస్తోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 9:42 AM GMT
కాంతారా స్టార్ తో దేవర.. వైరల్ క్లిక్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కి కన్నడనాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ మదర్ సొంతూరు బళ్ళారి కావడంతో కన్నడ ప్రజలు ఎన్టీఆర్ ని తమవాడిగా అనుకుంటారు. అందుకే కర్ణాటకలో ఎక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ కి ఘన స్వాగతం లభిస్తోంది.


ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్ట్ లో కాంతారా స్టార్ రిషబ్ శెట్టితో కలిసి నడుస్తోన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటున్నట్లు ఆ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫోటోలో రిషబ్ శెట్టి కంప్లీట్ గా పట్టు బట్టలతో ట్రెడిషనల్ స్టైల్ లో కనిపించాడు.


ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే బ్లూ కలర్ షర్టు, ప్యాంట్ తో దర్శనమిచ్చాడు. అయితే ఏ సందర్భంలో వీరిద్దరూ మంగళూరు ఎయిర్ పోర్ట్ లో కలిశారనేది తెలియదు. రిషబ్ శెట్టి సొంత ఊరు మంగళూరు. ఆయన దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసింది కూడా మంగళూరు బేస్డ్ గా తెరకెక్కే సినిమాలతోనే. ఇక ఇద్దరు మాట్లాడుకుంటున్న విధానం బట్టి జూనియర్ ఎన్టీఆర్ ని రిసీవ్ చేసుకోవడానికి రిషబ్ శెట్టి వచ్చి ఉంటాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రిషబ్ శెట్టి 2023కి గాను కాంతారా సినిమాలో పెర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తీసుకున్నాడు. దేశ వ్యాప్తంగా రిషబ్ శెట్టికి సోషల్ మీడియాలో స్టార్ యాక్టర్స్ నుంచి విషెస్ లభించాయి. రిషబ్ శెట్టి, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య ఈ మధ్యకాలంలో మంచి బాండింగ్ ఏర్పడింది. వీరు రెగ్యులర్ గా కలుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా రిషబ్ శెట్టి ఒక సినిమా చేస్తే బాగుంటుందనే మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాని స్టార్ట్ చేశాడు. దేవర మూవీ రిలీజ్ తర్వాత డ్రాగన్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందంట. ప్రస్తుతం ఈ మూవీ కోసం క్యాస్టింగ్ ని ఫైనల్ చేసుకునే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు.