Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'దేవర 2' కి అంత ఈజీ కాదు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' సినిమా షూటింగ్‌ స్పీడ్ గా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 6:00 AM GMT
ఎన్టీఆర్‌ దేవర 2 కి అంత ఈజీ కాదు..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' సినిమా షూటింగ్‌ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ దర్శకుడు అధికారికంగా ప్రకటించాడు. దేవర 1 ను వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇక దేవర 2 ను వెంటనే అంటే 2025 లో విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ లేదా జనవరి వరకు దేవర 1 షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. దేవర 2 కి సంబంధించి ఎలాంటి షూటింగ్‌ జరగలేదు.

దేవర 2 షూటింగ్ ప్రారంభం అవ్వాలి అంటే ఇప్పటికే ఎన్టీఆర్‌ కమిట్ అయిన వార్ 2 మరియు ప్రశాంత్‌ నీల్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుందట. వార్ 2 షూటింగ్‌ లో అతి త్వరలోనే ఎన్టీఆర్‌ పాల్గొంటాడు. ఇక ప్రశాంత్‌ నీల్‌ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత ప్రారంభించాలని నిర్ణయించారు.

సలార్‌ సినిమా తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ తన కొత్త సినిమాను ఎన్టీఆర్‌ తో మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. అదే కనుక నిజం అయితే వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ సినిమాలు ముగించిన తర్వాత మాత్రమే దేవర 2 సినిమా కు డేట్లు ఇవ్వడం సాధ్యం. అంటే 2025 వరకు దేవర షూటింగ్‌ కోసం కొరటాల వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

దేవర 1 సూపర్ డూపర్‌ హిట్ అయితే ఎన్టీఆర్‌ ప్లాన్ లో ఏమైనా మార్పు ఉండవచ్చు. ఒక వేళ దేవర 1 ఫలితం తారుమారు అయితే పరిస్థితి ఏంటి.. అసలు రెండో పార్ట్‌ ను కొరటాల చేసేంత సాహసం చేస్తాడా.. ఎన్టీఆర్‌ ఆలోచన ఏంటో అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి దేవర 2 సినిమా అంత ఈజీగా వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు.