Begin typing your search above and press return to search.

'దేవ‌ర' ఆయుధం 'సింహాద్రి' ఆయుధాన్ని కొట్టేలా?

ఈ సాయంత్రం, మేకర్స్ సోషల్ మీడియాల్లో అభిమానుల‌ను టీజ్ చేస్తూ ఆయుధం ఫోటోని రిలీజ్ చేసారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:05 AM GMT
దేవ‌ర ఆయుధం సింహాద్రి ఆయుధాన్ని కొట్టేలా?
X

త‌మ‌ సినిమాల్లో ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన ఆయుధాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం రాజ‌మౌళి, బోయ‌పాటి లాంటి ద‌ర్శ‌కుల‌ ప్ర‌త్యేక‌త‌. ఆ ఇద్ద‌రూ తెర‌కెక్కించిన భారీ యాక్ష‌న్ సినిమాల్లో క‌థానాయ‌కులు భీక‌ర‌మైన ఆయుధాల‌తో ఎటాక్ కి దిగుతారు. ఇవ‌న్నీ మాస్ ఆడియెన్ ని ఎగ్జ‌యిట్ చేసే అంశాలు. ఇంత‌కుముందు మిర్చి లాంటి హై ఆక్టేన్ యాక్ష‌న్ చిత్రంలో కొర‌టాల శివ కూడా స్పెష‌లైజేష‌న్ ఉన్న ఆయుధాల‌నే హీరో చేతికి ఇచ్చారు.

ఇప్పుడు 'దేవ‌ర‌'లో ఎన్టీఆర్ చేతికి ఎలాంటి ఆయుధం ఇచ్చారు? అని ప్ర‌శ్నిస్తే.. దానికి స‌మాధానం ఇలా ఉంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దూకుడుకు త‌గ్గ‌ట్టే కొర‌టాల ప్ర‌త్యేక ఆయుధాన్ని రెడీ చేయించి దానికి పూజ‌లు కూడా చేయించారు. ఇప్పుడు ఈ ఆయుధం ఇన్ స్టా మాధ్య‌మంగా సంచ‌ల‌నంగా మారింది. మ‌రింత‌గా వివ‌రాల్లోకి వెళితే..

దేవర యూనిట్ ప్రస్తుతం ఆయుధ పూజ అనే హై-వోల్టేజ్ పాటను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం, మేకర్స్ సోషల్ మీడియాల్లో అభిమానుల‌ను టీజ్ చేస్తూ ఆయుధం ఫోటోని రిలీజ్ చేసారు. ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ పీస్ ఇది. ''ఆయుధ పూజ నుండి క్షణాలు.. ఇప్పుడు 'ఢీ'తో స్ప్లాష్ అవుతున్నాయి'' అని దీనికి క్యాప్ష‌న్ రాసారు. ఈ స్పెష‌ల్ ఆయుధాన్ని చూసిన త‌ర్వాత‌ తారక్ అభిమానులు ఎంతగానో ఎగ్జ‌యిట్ అవుతున్నారు. దేవ‌ర‌లో కూడా భారీత‌నం నిండిన‌ యాక్ష‌న్ కి కొద‌వేమీ లేద‌ని భావిస్తున్నారు. ఈ ప్ర‌త్యేకమైన ఆయుధాన్ని వీక్షించాక .. అభిమానులు ఎన్టీఆర్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'సింహాద్రి'ని గుర్తు చేసుకుంటున్నారు. దానిని జ‌క్క‌న్న తెర‌కెక్కించారు. సింహాద్రి ఆయుధం గురించి అప్ప‌ట్లో బోలెడంత డిబేట్ న‌డిచింది. ఇక‌ 'దేవ‌ర' ఆయుధం 'సింహాద్రి' ఆయుధాన్ని కొట్టేలా ఉందంటూ ఇప్పుడు అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇత‌ర వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లే విడుద‌లైన దేవ‌ర గ్లింప్స్ 'చుట్ట‌మ‌ల్లే' అంత‌ర్జాలంలో సునామీ వేగంతో వైర‌ల్ అయింది. దీనికి స్వ‌దేశంలోనే కాకుండా విదేశాల్లోను అనుక‌ర‌ణ‌లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ దేవరలో విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దేవర: పార్ట్ 1 చిత్రం 27 సెప్టెంబర్ 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా విడుదలకు సిద్ధమవుతోంది.