Begin typing your search above and press return to search.

దేవర.. మొత్తానికి అలా సెట్టయిన డీల్స్

ఈ తేదీ సెలవుల సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు అనుకూలంగా ఉంది.

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:30 AM GMT
దేవర.. మొత్తానికి అలా సెట్టయిన డీల్స్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ థాయిలాండ్‌లోని క్రాబి ఐలాండ్స్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై ఒక అందమైన రొమాంటిక్ సాంగ్ షూట్ అవుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ అనేలా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దేవరా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ తేదీ సెలవుల సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు అనుకూలంగా ఉంది.

దసరా పండుగ అక్టోబర్ 11న జరుపుకుంటారు. కాబట్టి జాక్ పాట్ లాంటి డేట్ అని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన డీల్స్ కూడా అద్భుతంగా ఉన్నట్లు టాక్ వస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన ఎస్. నాగ వంశీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ డీల్ ఫైనల్ ధరకు క్లోజ్ అయినట్లు సమాచారం.

తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ సినిమాను విడుదల చేయనున్నారట. వంశీకి అన్ని ప్రాంతాల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి, అందువల్ల సినిమా విడుదలకు ముందే తన కమిట్‌మెంట్‌ను పూర్తి చేసుకుంటాడని చెప్పవచ్చు. దేవరా సినిమాకు భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేయడం, జాన్వీ ఫస్ట్ తెలుగు సినిమా కావడంతో సినిమాపై మంచి హైప్ అయితే ఉంది.

అందుకే ఈ దసరా సీజన్‌లో అత్యంత ప్రాముఖ్యమైన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే 109, థాండెల్ వంటి చిత్రాలు కూడా దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ, దేవరా సినిమాపైనే ఎక్కువ ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంది. దేవరా చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు.

రాక్‌స్టార్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దేవరా ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ప్రదానంగా హైలెట్ కానుందట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్, మరియు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తారని సినీ పరిశ్రమలో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దసరా సీజన్‌లో దేవరా చిత్రంతో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఈ సినిమా విడుదలతో దసరా సీజన్‌ మరింత హైలెట్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కు కూడా ఈ పండగ చాలా సెంటిమెంట్. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.