Begin typing your search above and press return to search.

'దేవర' బిజినెస్‌ రికార్డులు షురూ

రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ కి సంబంధించిన బిజినెస్ షురూ అయినట్లుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 9:30 AM GMT
దేవర బిజినెస్‌ రికార్డులు షురూ
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ కి సంబంధించిన బిజినెస్ షురూ అయినట్లుగా సమాచారం అందుతోంది.

సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ప్రముఖ ఆడియో కంపెనీ టీ సిరీస్ ఈ సినిమా యొక్క ఆడియో హక్కులను రికార్డ్ స్థాయి మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా యొక్క ఆడియో హక్కులను కూడా ఇదే సంస్థ భారీ మొత్తానికి ఇటీవల కొనుగోలు చేయడం జరిగింది.

దేవర సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టాలీవుడ్‌ లో అనిరుధ్ పలు మ్యూజికల్‌ హిట్స్ ను ఇచ్చాడు. అయితే స్టార్‌ హీరోల సినిమాలకు ఆయన వర్క్ చేసినప్పుడు మాత్రం నిరాశ పరుచుతూ వచ్చాడు. మరి ఈసారి అయినా సక్సెస్ దక్కించుకునేనా చూడాలి.

అనిరుధ్ మ్యూజిక్ తో మరో రెండు రోజుల్లో దేవర 1 గ్లిమ్స్ రాబోతున్నాయి. సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో దేవర గ్లిమ్స్ థియేటర్లలో సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.