Begin typing your search above and press return to search.

11 రోజుల్లో దేవర సెంచరీ...!

తక్కువ సమయంలోనే 50 మిలియన్ ల వ్యూస్‌ ను, 75 మిలియన్‌ ల వ్యూస్ ను సొంతం చేసుకున్న దేవర సెకండ్‌ సింగిల్‌ 11 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే ఏకంగా 100 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 5:27 AM GMT
11 రోజుల్లో దేవర సెంచరీ...!
X

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక 'దేవర' మూవీ నుంచి 11 రోజుల క్రితం సెకండ్‌ సింగల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి పాటకు మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటకు ఎన్టీఆర్‌ అభిమానులు ఉర్రూతలూగి పోయారు. ఇప్పుడు చుట్టమల్లె అంటూ వచ్చిన పాటకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌ లో ఈ పాట రికార్డ్‌ స్థాయి వ్యూస్ దక్కాయి. భారీ ఎత్తున వస్తున్న వ్యూస్ తో దేవర సరికొత్త రికార్డులను సృష్టించబోతుంది.


తక్కువ సమయంలోనే 50 మిలియన్ ల వ్యూస్‌ ను, 75 మిలియన్‌ ల వ్యూస్ ను సొంతం చేసుకున్న దేవర సెకండ్‌ సింగిల్‌ 11 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే ఏకంగా 100 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. సాధారణంగా హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లేదా బాలీవుడ్‌ సినిమా పాటలు ఇలా భారీ వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరుగుతుంది. సౌత్‌ సినిమా పాటలు ఇంత స్పీడ్ గా వంద మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవర సినిమా పాట అంతకు మించి అంటూ దక్కించుకుంటున్న వ్యూస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదల అయిన తర్వాత పాటలకు మంచి క్రేజ్ క్రియేట్‌ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ దేవర సాంగ్స్ కి మాత్రం విడుదలకు ముందే ఓ రేంజ్ లో ఆధరణ లభిస్తుంది. చుట్టమల్లె పాటకు దక్కిన స్పందన చూస్తూ ఉంటే సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలుగుతుందని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ గతంలో చేసిన సినిమాలన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే విధంగా ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఉంటాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.

అనిరుధ్ అందించిన ఈ పాట మ్యూజిక్ విషయంలో మొదట ట్రోల్స్ వచ్చినా వాటన్నింటిని దాటుకుని, ఆ ట్రోల్స్ వల్ల మరింతగా వ్యూస్ ను రాబట్టుకుంటూ దూసుకు పోతుంది. యూట్యూబ్‌ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టడంతో పాటు, లైక్స్ మరియు షేర్స్ ను కూడా ఈ పాట దక్కించుకోబోతుంది. కేవలం యూట్యూబ్‌ లోనే కాకుండా పలు పాటల స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్ పై కూడా ఈ పాటలు సందడి చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ ఆర్ఆర్‌ఆర్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఆ స్థాయిలో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కొరటాల శివ చాలా సమయం తీసుకుని ఈ సినిమాను చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.