Begin typing your search above and press return to search.

దేవర : అప్పుడే సెంచరీకి చేరువ!

తాజాగా ఈ పాట యూట్యూబ్‌ లో ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 10:39 AM GMT
దేవర : అప్పుడే సెంచరీకి చేరువ!
X

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న దేవర సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా నుంచి ఇటీవల చుట్టమల్లే పాట వచ్చింది. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ల కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు కన్నుల విందు అన్నట్లుగా ఈ పాట ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ చాలా అందంగా ఉందని, సినిమాలో ఇంకా ఎంత అందంగా ఆమెను చూడబోతున్నామో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దేవర సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లే సాంగ్‌ విడుదల అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ తో పాటు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై వైరల్‌ అయ్యింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌ లో ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఈ పాట యూట్యూబ్‌ లో సెంచరీ మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయంతో ఉన్నారు.

ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో పాటు భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల దేవర కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే గతంలో విడుదల అయిన పాటకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈ పాట వ్యూస్ ను రాబడుతూ రికార్డు దిశగా దూసుకు వెళ్తుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా దేవర పాటలను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే తక్కువ సమయంలోనే ఏకంగా 75 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట సొంతం చేసుకుంది. సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు నమోదు అవ్వబోతున్నాయో అంటూ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

దేవర సినిమాతో పాటు హిందీ వార్ 2 సినిమాను కూడా ఎన్టీఆర్‌ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పై ఉండగానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇటీవలే ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెల్సిందే. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మంచి కథతో ఈ సినిమా ను రూపొందించేందుకు ప్రశాంత్‌ నీల్‌ కథ ను రెడీ చేశాడంటూ మేకర్స్ చెబుతున్నారు. దేవర సినిమా విడుదల అయిన వెంటనే ప్రశాంత్‌ నీల్, ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కబోతుంది.