Begin typing your search above and press return to search.

దేవర హై ఓల్టేజ్ సర్‌ప్రైజ్.. సముద్రం పై ఎన్టీఆర్!

అయితే మూవీపై మరింత హైప్ తెప్పించేందుకు ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 7:06 AM GMT
దేవర హై ఓల్టేజ్ సర్‌ప్రైజ్.. సముద్రం పై ఎన్టీఆర్!
X

ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చిరంజీవి ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ కొరటాల శివ.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ తో సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీపై మరింత హైప్ తెప్పించేందుకు ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.


న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చింది. హై రేంజ్‌లో రూపొందుతున్న దేవర మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను జనవరి 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతోపాటు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్‌ఫుల్‌ గెటప్‌తో కనిపించారు. దీంతో ఆ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమా నుంచి వస్తున్న తొలి ప్రమోషనల్ కంటెంట్ కనుక అన్ని అన్ని భాషల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా దేవర గ్లింప్స్ ను కొరటాల రెడీ చేస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలయ్యే అన్ని భాషల చిత్రాలకు దేవర గ్లింప్స్ ను మేకర్స్ అటాచ్ చేయబోతున్నారట.

ఇక సినిమా విషయానికొస్తే.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరు ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేసవి కానుకగా తొలిపార్ట్ ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.

దేవర తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ ఏప్రిల్‌లో పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌ తో పాన్ ఇండియా లెవల్ లో భారీ మల్టీస్టారర్ మూవీ వార్ 2 చేయనున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.