Begin typing your search above and press return to search.

ఆ హాలీవుడ్ మూవీతో దేవరకు పెద్ద చిక్కే..?

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఓవర్సీస్ వసూళ్లు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:56 AM GMT
ఆ హాలీవుడ్ మూవీతో దేవరకు పెద్ద చిక్కే..?
X

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన మూవీ వచ్చి దాదాపు ఐదేళ్లు దాటిపోతోంది. 2018లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత తారక్.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కే తన ఫుల్ డేట్స్ ను కేటాయించారు. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యాక కొరటాల శివతో చేతులు కలిపారు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రాగా.. ఇప్పుడు దేవర మూవీ తెరకెక్కుతోంది. అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. విలన్ సైఫ్ అలీఖాన్ ఓ ప్రమాదంలో గాయపడడంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ ఉండిపోయింది. దీంతో మేకర్స్ ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికైనా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఓవర్సీస్ వసూళ్లు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. కానీ దేవర విడుదలకు ఒక వారం ముందు హాలీవుడ్‌ మ్యూజికల్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జోకర్‌ సీక్వెల్ జోకర్-2 రిలీజ్ కానుంది. టాడ్‌ ఫిలిప్స్, బ్రాడ్లీ కూపర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్నర్‌ బ్రదర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. అక్టోబర్ 4న రిలీజ్ కానుంది.

జోకర్ రిలీజ్ అవ్వడం వల్ల దేవర మూవీకి అమెరికాలో థియేటర్లకు చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఎక్స్ డీ, ఐమాక్స్ వంటి పెద్ద స్క్రీన్లు దేవరకు దక్కడం కష్టమే. ఒకవేళ అదే డేట్ కు రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంచే ఎక్కువ స్క్రీన్లను దక్కించుకోవడం కోసం బాగా ట్రై చేయాలని సినీ పండితులు చెబుతున్నారు. మరి రిలీజ్ డేట్ విషయంలో దేవర మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాష్ రాజ్, చైత్ర రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే దేవర కొత్త రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. మరేం జరుగుతుందో? ఏంటో?