Begin typing your search above and press return to search.

'దేవర'.. హైప్ కోసం భారీ ప్లాన్?

ఇదిలా ఉంటే మేకర్స్ త్వరలోనే దేవర నుంచి ఓ అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:00 AM GMT
దేవర.. హైప్ కోసం భారీ ప్లాన్?
X

'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య తో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్‌, భారీ కాస్టింగ్‌తో పాటూ బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు. ఇదిలా ఉంటే మేకర్స్ త్వరలోనే దేవర నుంచి ఓ అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

గ్లింప్స్ తోనే దేవరపై ఆడియన్స్ లో విపరీతమైన బజ్ ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 8న దేవర గ్లింప్స్ డేట్ ని లాక్ చేసిందట మూవీ టీం. న్యూ ఇయర్ స్పెషల్ అప్డేట్ గా దేవర గ్లింప్స్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారట. లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలయ్యే అన్ని భాషల చిత్రాలకు దేవర గ్లింప్స్ ని అటాచ్ చేయబోతున్నారట.

సినిమా నుంచి వస్తున్న మొట్టమొదటి ప్రమోషనల్ కంటెంట్ కావడంతో అన్ని భాషల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా దేవర గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. తెలుగులో ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాల ఉన్నాయి. ఇక దేవరను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అన్ని భాషల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఈ సినిమాని రెండు భాగాలుగా బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. పార్ట్-1 భారీ స్థాయిలో సక్సెస్ అయితేనే పార్ట్-2 మీద అందరిలో అంచనాలు ఉంటాయి.

కాబట్టి పార్ట్ వన్ సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ కూడా పాన్ ఇండియా వైడ్ రీచ్ అవ్వాలి. ఈ రోజుల్లో సినిమాపై హైప్ పెరగాలంటే అది ప్రమోషనల్ కంటెంట్ ద్వారానే అవుతుంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ నుంచి రిలీజ్ తర్వాత సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి. ఒకవేళ ఈ బజ్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయితే మాత్రం కేవలం మౌత్ టాక్ తో ఆడియన్స్ థియేటర్స్ కి లాగడం కష్టం.

దేవర మూవీ టీం కి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే ఇప్పటివరకు సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ ని రిలీజ్ చేయలేదు. కాస్త ఆలస్యమైన బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలనే అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ బెస్ట్ అవుట్ ఫుట్ ని అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా గ్లింప్స్ ని రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారు.