Begin typing your search above and press return to search.

దేవ‌ర ఇంట్రో సాంగ్.. అంత‌కుమించి..!

ఈ పాట‌లో తార‌క్ స్టెప్పుల్లో గ్రేస్ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:29 AM GMT
దేవ‌ర ఇంట్రో సాంగ్.. అంత‌కుమించి..!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంట‌గా కొరటాల శివ తెర‌కెక్కిస్తున్న పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'దేవర' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టి. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే ఈ బ్యూటీ తార‌క్ ఫ్యాన్స్‌ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని రెండవ పాట 'చుట్టమల్లె'లో జాన్వీ తన గ్లామ‌ర‌స్ లుక్స్, సొగసైన కదలికలు మ‌తులు చెడ‌గొట్టాయి. మామ్ శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ క‌పూర్ త‌న స్థాయిని నిల‌బెట్టుకుంటోంద‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. తార‌క్ లాంటి క్లాసిక్ డ్యాన్సర్ తో జాన్వీ స్టైలిష్ స్టెప్పుల‌కు మంచి పేరొచ్చింది. చుట్టమల్లె పాట యూట్యూబ్‌ సహా అన్ని ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను క‌లుపుకుని దాదాపు 10కోట్ల (100 మిలియన్ల) వీక్షణలను సంపాదించింది.

జాన్వీ ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో చుట్టమల్లె హిందీ వెర్షన్ 'ధీరే ధీరే' కవర్ వెర్షన్ వీడియోను షేర్ చేసింది. తెల్లటి పూల గౌను ధరించిన‌ జాన్వీ వీడియోలో ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. ఈ క్లిప్ ఇమేజెస్‌లోను జాన్వీ లుక్స్ ఆక‌ర్షించాయి. ఎన్టీఆర్- జాన్వీ న‌డుమ రొమాన్స్ పాట‌ల్లో అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. ఇక ఇందులో జాన్వీ క‌పూర్ ఒక గ్రామీణ యువ‌తి రూపంలో అద‌ర‌గొడుతోంది. తార‌క్ లో రెట్టించిన ఎన‌ర్జీ తెర‌పై క‌నిపిస్తోంది.

మ‌రోవైపు దేవ‌ర ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌ను కొర‌టాల చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఈ పాట‌లో తార‌క్ స్టెప్పుల్లో గ్రేస్ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు వెల్ల‌డించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పాట‌ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రారంభం కానుంది.