Begin typing your search above and press return to search.

దేవర.. స్పీడ్ పెంచే టైమొచ్చింది

అందుకే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 12:30 AM GMT
దేవర.. స్పీడ్ పెంచే టైమొచ్చింది
X

'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో దేవర కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఆచార్య మూవీతో కెరియర్లో మొదటిసారి డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర మూవీతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు రీజనల్ ఫిలిమ్స్ చేసిన కొరటాల దేవరతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న దేవర లేటెస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. సుమారు నెల రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెట్స్ లో అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ 85% ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

పటి నుంచి దేవర న్యూ షెడ్యూల్ మొదలుకానుంది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 7 రోజుల టాకీ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. పాటల చిత్రీకరణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఆలస్యం చేస్తున్నందు వల్లే షూటింగ్ షెడ్యూల్స్ ని మరింత పొడిగించినట్లు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్. ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే బ్యాలెన్స్ వర్క్ త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ డోస్ పెంచాలని అనుకుంటున్నారు. ఇక ఇందులో ఫైట్స్ ను యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న ఈసినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.