ఒకే డైలాగ్ తో దేవరకొండ బ్రదర్స్.. ఇంట్రెస్టింగ్ కామెంట్..!
బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.
By: Tupaki Desk | 27 Aug 2023 8:09 AM GMTబేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. జులై 16న బేబీ రిలీజ్ కాగా నెలన్నర గ్యాప్ తో అన్నయ్య విజయ్ దేవరకొండ ఖుషి అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. లవ్ స్టోరీ ఆఫ్టర్ మ్యారేజ్ కాన్సెప్ట్ తో క్రేజీగా రాబోతుంది ఖుషి.
ఈ సినిమా విషయంలో విజయ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా లో విజయ్ సమంతల కేమిస్ట్రీ బాగా వర్క్ అయినట్టు తెలుస్తుంది. రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ చేస్తూ బజ్ పెంచేస్తున్నారు. సినిమా ట్రైలర్ లో ఒక డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖుషి సినిమా లో అది నా పిల్ల డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ ఆ డైలాగ్ ని చెప్పాడు. అయితే రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాలో కూడా అది నా పిల్ల డైలాగ్ చెప్పాడు. ఇద్దరు దేవరకొండ బ్రదర్స్ ఒకటే డైలాగ్ ని వాడేశారు.
ఏ సినిమా అయినా రిలీజ్ ముందు ట్రైలర్ ప్రమోషన్స్ తోనే సోషల్ మీడియా లో హడావిడి మొదలవుతుంది. మీమ్స్ క్రియేటర్స్ అయితే అందులోని డైలాగ్స్ తో మీమ్స్ చేస్తారు. ఖుషి లో అది నా పిల్ల డైలాగ్ ని.. ఆనంద్ బేబీ సినిమా వీడియో యాడ్ చేస్తూ మీమ్ వీడియో చేశారు. దానికి ఆకలేసిన వాడు ఒకలా అంటాడు ఎదురుదెబ్బ తగిలిన వాడు ఒకలా అంటాడని బ్రహ్మానందం డైలాగ్ ని యాడ్ చేశారు. ఈ మీమ్ వీడియో విజయ్ దేవరకొండ దాకా వెళ్లడంతో అతను స్పందించాడు. అది నా పిల్ల అదొక ఎమోషన్ అని అన్నారు. ఇక దీనికే ఆనంద్ కూడా రిప్లై ఇస్తూ ట్విట్టర్ అప్పుడప్పుడు ఇలాంటి రత్నాలను వెలికి తీస్తుందని కామెంట్ పెట్టాడు.
ఖుషి సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. లవ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందా లేదా అన్నది చూడాలి. డియర్ కామ్రేడ్ నుంచి విజయ్.. వరుస ఫ్లాపులతో సమంత.. టక్ జగదీశ్ ఫెయిల్యూర్ తో శివ నిర్వాణ ముగ్గురు కూడా ఖుషి తో హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. మరి వారు అనుకున్న విధంగా ఆడియన్స్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.