Begin typing your search above and press return to search.

దేవరకొండ × దుల్కర్.. క్రేజీ కాంబో

ఈ మధ్యకాలంలో ఒకే సారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ రెండు సినిమాలకి సంబందించిన హీరోలు కలిసి ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకోవడం చూస్తున్నాం.

By:  Tupaki Desk   |   20 Aug 2023 3:46 AM GMT
దేవరకొండ × దుల్కర్.. క్రేజీ కాంబో
X

ఈ మధ్యకాలంలో ఒకే సారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ రెండు సినిమాలకి సంబందించిన హీరోలు కలిసి ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకోవడం చూస్తున్నాం. ఈ రకమైన ట్రెండ్ టాలీవుడ్ లోనే స్టార్ట్ అయ్యింది. గతంలో దసరా, రావణాసుర రిలీజ్ సమయంలో రవితేజ, నాని కలిసి ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. తాజాగా మరో ఇంటరెస్టింగ్ కాంబినేషన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలోకి వచ్చింది.

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీతో తెలుగులో సోలోగా సూపర్ హిట్ కొట్టి స్టార్ అయ్యాడు. ఈ కారణంగా అతని ప్రతి సినిమాని తెలుగు ఆడియన్స్ చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోతా మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యారు. అలాగే ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

వీరిద్దరూ కలిసి ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కింగ్ ఆఫ్ కోతా మూవీ 110 రోజుల్లో పూర్తిచేసినట్లు దుల్కర్ చెప్పాడు. దీనికి విజయ్ దేవరకొండ షాక్ అయ్యాడు. లవ్ స్టోరీతో చేసిన తన ఖుషి కంప్లీట్ కావడానికి 100 రోజులు పట్టిందని, అలాంటిది యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ ఎలా అంత తక్కువ టైంలో చేసేశారని విజయ్ అడిగాడు.

మలయాళం సినిమాలు చాలా వరకు 50 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయని, తమ డైరెక్టర్స్ కరెక్ట్ ప్లానింగ్ వలన ఇది సాధ్యమవుతుందని దుల్కర్ చెప్పారు. తాను కూడా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్నానని, ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని చూడాలని విజయ్ అతని మాటలకి రియాక్షన్ గా చెప్పారు.

ఇంత వరకు వీరి ఇంటర్వ్యూ బాగానే ఉన్న కూడా తెలుగు దర్శకులు సినిమా షూటింగ్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకుంటారనే విషయాన్ని పరోక్షంగా జనాల్లోకి పంపించినట్లు అయ్యింది. మలయాళీ దర్శకులు వేగంగా సినిమాలు చేయడం వలన వారి సినిమాలకి బడ్జెట్ పరంగా కూడా తక్కువ ఖర్చవుతూ ఉంటుందని అర్ధమవుతోంది. ఏదెలా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇలా కలిసి ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేసుకోవడం మాత్రం వారి అభిమానులకి ఆసక్తి పెంచిందని చెప్పొచ్చు.