మిడిల్ క్లాస్ స్టేటస్ మార్చే దేవరకొండ మంత్రం..!
కీడా కోలా సినిమాలో బ్రహ్మానందం కూడా నటించారు. సినిమాలో ఆయన్ను తీసుకోవడం కమర్షియల్ అంశమే అయినా ఆయనతో పనిచేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్ అన్నారు తరుణ్ భాస్కర్.
By: Tupaki Desk | 30 Oct 2023 10:02 AM GMTతరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు విజయ్ దేవరకొండ. దేవరకొండతో పెళ్లిచూపులు తీసి సూపర్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ ఓ పక్క డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. డైరెక్టర్ గా తన స్పెషాలిటీ చూపిస్తూ వస్తున్న తరుణ్ భాస్కర్ కీడా కోలాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
సినిమా ఈవెంట్ లో విజయ్ కూడా తనకు తరుణ్ భాస్కర్ మీద గట్టి నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని అన్నారు. అంతేకాదు వేడుకలో భాగంగా మనం ఎంచుకునే విషయాలే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయని కూడా చెప్పారు. తరుణ్ భాస్కర్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్ మేమంతా కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులం కాదని మేము కన్న కల మా అందరినీ ఒక దగ్గరకు చేర్చిందని అన్నారు విజయ్ దేవరకొండ.
అంతేకాదు అప్పట్లో మేము కూడా జేబులో రూపాయి లేకుండా తిరిగామని. ఒకరు కష్టపడితే మిడిల్ క్లాస్ స్టేటస్ మార్చొచ్చని యువతకి సందేశం ఇచ్చారు విజయ్ దేవరకొండ. కలలు కనాలి ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని అన్నారు. 90 శాతం మిడిల్ క్లాస్ యువతకు ఎన్నో కలలు ఉంటున్నాయని వాటిని కష్టపడి సాధించుకోవాలని అన్నారు విజయ్ దేవరకొండ.
అంతేకాదు ఈవెంట్ లో భాగంగా తరుణ్ భాస్కర్ తో తన సినిమా కూడా అనౌన్స్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటుగా గౌతం తిన్ననూరి సినిమా కూడా లైన్ లో ఉంది. ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి వస్తుంది గౌతం తిన్ననూరి సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. తరుణ్ భాస్కర్ తో సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ తో పాటు ఈ వేడుకకి బ్రహ్మానందం కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కీడా కోలా సినిమాలో బ్రహ్మానందం కూడా నటించారు. సినిమాలో ఆయన్ను తీసుకోవడం కమర్షియల్ అంశమే అయినా ఆయనతో పనిచేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్ అన్నారు తరుణ్ భాస్కర్. కీడా కోలా కచ్చితంగా మీ అందరినీ నవ్విస్తుందని.. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి.. అలా అని మనం నవ్వటం ఆపేయలేము.. సో నవంబర్ నెల నవ్వులు పంచేందుకు కీడా కోలా వస్తుందని తన మార్క్ స్పీచ్ తో అలరించారు దర్శకుడు తరుణ్ భాస్కర్.