కుటుంబ సమేతంగా ఈ ట్రిప్ కి వెళ్లారా?
రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన జంట స్నేహం, డేటింగ్ గురించి నిరంతరం సోషల్ మీడియాల్లో చర్చ సాగుతూనే ఉంది
By: Tupaki Desk | 17 Jan 2024 4:27 AM GMTరౌడీ బోయ్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన జంట స్నేహం, డేటింగ్ గురించి నిరంతరం సోషల్ మీడియాల్లో చర్చ సాగుతూనే ఉంది. ఆ ఇద్దరూ కలిసి విదేశీ విహారయాత్రలకు వెళ్లారన్న ప్రచారం ఉంది. ప్రతిసారీ వెకేషన్ పేరుతో ఈ జంట విదేశాలకు వెళ్లినా దానిని సీక్రెట్ గా దాచేస్తున్నారనేది అభియోగం. కొందరు అభిమానులు సీక్రెట్ డేటింగ్ అంటూ పలుమార్లు ఆ ఇద్దరూ షికార్లు చేసిన రెస్టారెంట్లు, షాపింగ్ ప్లేసెస్ తాలూకా ఫోటోలను షేర్ చేసారు.
అయితే ఒకే సమయంలో విజయ్ - రష్మిక ఇద్దరూ ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల సందేహాలను రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక ట్రిప్ నుంచి ఆ ఇద్దరూ అభిమానులు టీజ్ చేయడంతో మరోసారి సీక్రెట్ ట్రిప్ వెళ్లారంటూ ప్రచారం సాగుతోంది. ఈ జంట ఇటీవల వియత్నాం అందాలను ఆస్వాధించేందుకు వెళ్లారని కామెంట్ చేస్తున్నారు. దానికి కారణం వారం వ్యవధిలో విజయ్, రష్మికలు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులే.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా కనిపించిన ఈ జోడీ నాటి నుంచి నిష్కల్మషమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఇరువురి కుటుంబాల నడుమ సాన్నిహిత్యం బలపడింది. జంటగా వెకేషన్లకు వెళ్లడం, వేడుకల్లో కనిపించడంతో ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న పుకార్లు వచ్చాయి కానీ వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గాను ధృఢమైన బంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ ఇద్దరూ కేవలం స్నేహితులం మాత్రమేనని, పెళ్లి పై వస్తున్న వార్తలు అవాస్తవమని కూడా ఖండించినా రిపీటెడ్ గా ఇవే పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి వియత్నాం ట్రిప్ లో విజయ్ దేవరకొండతో పాటు తన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా కనిపించాడు. దీనిని బట్టి కుటుంబ సమేతంగా ఈ ట్రిప్ కి వెళ్లారా? అన్న సందేహాలు రేకెత్తాయి. వియత్నాంకి కలిసే వెళ్లి ఉండొచ్చు... కానీ కుటుంబంతో! అని కూడా కొందరు భావిస్తున్నారు. మొత్తానికి విజయ్, రష్మికల ఇన్ స్టాకు కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఫాలోవర్స్ మరింతగా పెరిగే ఛాన్స్ దొరికిందన్నమాట.