Begin typing your search above and press return to search.

దేవర డౌట్లు పెంచుతున్న వార్తలు..!

అయితే లేటెస్ట్ గా దేవర నుంచి మరో అప్డేట్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తుంది. దేవర లో తారక్ ఒక్కడు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 5:16 AM GMT
దేవర డౌట్లు పెంచుతున్న వార్తలు..!
X

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబోలో ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్న దేవర ప్రాజెక్ట్ ముందు ఒక సినిమాగా చేయాలని అనుకున్నా అవుట్ పుట్ బాగా వస్తుండటంతో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దేవర 1 సినిమా మొదట సమ్మర్ రిలీజ్ అనుకున్నా అది కుదరక అక్టోబర్ 10 కి రిలీజ్ అని ఫిక్స్ చేశారు. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కూడా అంచనాలు పెంచింది.

ఫస్ట్ గ్లింప్స్ టైం లోనే దేవరలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ అని మ్యాటర్ లీక్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర అఫీషియల్ రిలీజ్ డేట్ అక్టోబర్ 10న అంటూ వచ్చిన పోస్టర్ తో అది క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ మరో లుక్ తో పోస్టర్ లో కనిపించడం ఫ్యాన్స్ ని మెప్పించింది.

దేవర లో ఎన్టీఆర్ ఒక్కడు కాదు ఇద్దరు అని అభిమానులు ఖుషి అయ్యారు. దసరా బరిలో సినిమా డబుల్ ట్రీట్ అందించేందుకు వస్తుందని అనుకున్నారు. రిలీజ్ కోసం మరో ఆరు నెలలు వెయిట్ చేయాలా అన్న బాధ తప్ప దేవర పై ఎలాంటి డౌట్లు పెట్టుకోలేదు.

అయితే లేటెస్ట్ గా దేవర నుంచి మరో అప్డేట్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తుంది. దేవర లో తారక్ ఒక్కడు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. సినిమాలో డ్యుయల్ రోల్ వరకు ఓకే కానీ ట్రిపుల్ రోల్ అంటే సినిమా ఎలా ఉంటుందో అన్న డౌట్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో అలా ట్రిపుల్ రోల్ ట్రై చేశాడు. ఆ సినిమా హిట్ అయ్యింది కానీ రికార్డులు సృష్టించలేదు.

దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపిస్తాడని తెలిసి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అదీగాక ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు. సినిమాలో హీరో పాత్ర ఒకటైతే సినిమా ఎలాగోలా ఆడేస్తుందని అనుకుంటారు.

ఒకవేల డ్యుయల్ రోల్ అయినా కంటెంట్ పరంగా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తారు. కానీ ట్రిపుల్ రోల్ అంటే మాత్రం పకడ్బందీ కథ అందుకు తగిన కథనం కుదిరితేనే ఆ సినిమా అవుట్ పుట్ బాగుంటుంది. మరి దేవర సినిమాపై కొరటాల శివ ఎంత జాగ్రత్త పడుతున్నారో తెలియదు కానీ ఈ ట్రిపుల్ రోల్ మ్యాటర్ మాత్రం ఫ్యాన్స్ ని కాస్త డిస్టర్బ్ చేస్తుంది.