Begin typing your search above and press return to search.

దేవర : ఎన్టీఆర్‌, సైఫ్‌ మొదలు పెట్టిన 'వార్‌'

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా గురించి గత రెండు మూడు రోజులుగా తెగ చర్చ జరుగుతోంది

By:  Tupaki Desk   |   6 Oct 2023 7:38 AM GMT
దేవర : ఎన్టీఆర్‌, సైఫ్‌ మొదలు పెట్టిన వార్‌
X

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా గురించి గత రెండు మూడు రోజులుగా తెగ చర్చ జరుగుతోంది. మీడియా ముందుకు వచ్చి పుకార్లకు తావు ఇవ్వకుండా దర్శకుడు కొరటాల శివ తమ దేవర సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా ఫుల్‌ క్లారిటీ ఇవ్వడం తో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ ను ఒకే సారి పూర్తి చేస్తారా లేదంటే మొదటి భాగం విడుదల అయిన తర్వాత రెండో భాగం కు సంబంధించిన షూటింగ్ ని మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌ లోని ప్రముఖ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్‌ లో ఎన్టీఆర్‌, సైఫ్ అలీ ఖాన్‌ల మధ్య భీకర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరన జరుపుతున్నారట.

పెద్ద ఎత్తున ఫైటర్స్ పాల్గొంటున్న ఈ యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన విశేషాలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌ తో ఎన్టీఆర్‌ చేస్తున్న వార్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌ అన్నట్లుగా నిలుస్తాయట. ఇటీవలే అండర్ వాటర్ సన్నివేశాలను చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు సైఫ్ తో వార్‌ లో పాల్గొంటున్నాడు.

బాలీవుడ్‌ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్‌ తో యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ ఎలా కనిపించబోతున్నాడో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొత్తానికి దేవర సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఈ యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన విషయాల గురించి చర్చ జరుగుతోంది.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. సైఫ్ అలీ ఖాన్‌ తో ఎన్టీఆర్ చేస్తున్న వార్‌ సన్నివేశాల తర్వాత జాన్వీ కపూర్‌ తో రొమాంటిక్ కమ్‌ లవ్‌ సన్నివేశాలను చేస్తాడేమో చూడాలి. యాక్షన్ తో పాటు ఎంటర్‌ టైన్మెంట్ ని కూడా సమపాళ్లలో ఉండే విధంగా కొరటాల 'దేవర' ని రూపొందిస్తున్నాడు.

దేవర మొదటి పార్ట్‌ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రాబోతుంది. రెండో పార్ట్‌ కి సంబంధించిన విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 2025 లో రెండో పార్ట్‌ వస్తుందేమో చూడాలి. మరో వైపు హిందీ 'వార్‌ 2' కోసం ఎన్టీఆర్‌ రెడీ అవుతున్న విషయం తెల్సిందే. 2024 లో వార్‌ 2 రాబోతుంది.