Begin typing your search above and press return to search.

మ్యాజిక్‌ నెంబర్ తో 'దేవర' కౌంట్‌ డౌన్ షురూ

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ దేవర సినిమా రిలీజ్ కి మ్యాజిక్‌ నెంబర్‌ తో కౌంట్‌ డౌన్ షురూ చేయడం జరిగింది

By:  Tupaki Desk   |   5 Dec 2023 9:38 AM GMT
మ్యాజిక్‌ నెంబర్ తో దేవర కౌంట్‌ డౌన్ షురూ
X

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్‌ సాఫీగా సాగిపోతుంది. ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్‌ పూర్తి అవ్వడం ఖాయం అని, అలాగే గతంలో ప్రకటించినట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి కూడా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ దేవర సినిమా రిలీజ్ కి మ్యాజిక్‌ నెంబర్‌ తో కౌంట్‌ డౌన్ షురూ చేయడం జరిగింది. నేటి నుంచి సరిగ్గా ఒకటి రెండు మూడు అంటే 123 రోజుల్లో దేవర బాక్సాఫీస్ సందడి మొదలు అవ్వబోతుంది. దయ దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో మనం చూశాం. దేవర బాక్సాఫీస్ దండయాత్ర అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా కనిపిస్తున్నారు.

ఆచార్య సినిమా ఫలితం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో కొంత అనుమానంను కలిగిస్తున్నా కూడా కచ్చితంగా విడుదల సమయం వరకు అన్ని విషయాలను కొరటాల క్లీయర్‌ చేస్తాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అంత ఈజీగా తీసుకోలేదు. కనుక దేవర సినిమా రెండు భాగాలు కూడా బ్లాక్ బస్టర్‌ విజయాలను నమోదు చేయబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దేవర సినిమాలో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి ఓ భారీ పాన్ ఇండియా మూవీగా దేవర రూపొందుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం పాన్‌ ఇండియా రేంజ్ లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు. అందుకే కొరటాల శివ ఆలస్యం చేయకుండా, ఎలాంటి తప్పులు జరుగకుండా దేవర సినిమాను అద్భుతంగా రూపొందించి విడుదల చేయాలని కష్టపడుతున్నాడట. అందుకే 123 రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్‌ షురూ చేశారు.