Begin typing your search above and press return to search.

'దేవర'ని అనిరుధ్ రానిచ్చేనా?

దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. అనిరుధ్ పాటలు పూర్తి చేసి ఇస్తే వాటిని కూడా షూట్ చేస్తారు

By:  Tupaki Desk   |   23 Feb 2024 8:30 AM GMT
దేవరని అనిరుధ్ రానిచ్చేనా?
X

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు అందరు కూడా 'దేవర' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ పార్ట్‌ పూర్తి అవ్వక పోవడంతో పాటు వీఎఫ్‌ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అందుకే ఏకంగా అక్టోబర్‌ కి సినిమాను వాయిదా వేస్తూ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

అక్టోబర్ 10న అయినా ఈ సినిమా వస్తుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవర సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ ను మొదలు పెట్టలేదట. కొరటాల శివ మరియు అనిరుధ్‌ కాంబో మొదటి సారి అవ్వడం వల్ల మ్యూజిక్ సిట్టింగ్స్ కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

దేవర సినిమా మాత్రమే కాకుండా అనిరుద్‌ చేతిలో డజను సినిమాలు ఉంటాయి. కనుక ఆయన ఎక్కువ సమయం కేటాయించడం కష్టం అంటూ స్వయంగా యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే నిజం అయితే దేవర సినిమా మళ్లీ వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు.

దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. అనిరుధ్ పాటలు పూర్తి చేసి ఇస్తే వాటిని కూడా షూట్ చేస్తారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు రీ రికార్డింగ్‌ విషయంలో కూడా అనిరుధ్‌ స్పీడ్ గా వర్క్ చేస్తే తప్ప అక్టోబర్‌ లో దేవర వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి దేవర ను అనిరుధ్ రానిచ్చేనా చూడాలి.