Begin typing your search above and press return to search.

దేవర బిజినెస్.. సేఫ్ అయినట్లేనా?

తెలుగులో మొదటి చిత్రంతోనే శ్రీదేవి కూతురు తారక్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో జతకట్టడం నిజంగా అదృష్టం అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   8 July 2024 4:27 AM GMT
దేవర బిజినెస్.. సేఫ్ అయినట్లేనా?
X

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా దేవర. రెండేళ్ల గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో తారక్ సోలోగా పాన్ ఇండియా లెవల్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సెప్టెంబర్ 27న మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. తెలుగులో మొదటి చిత్రంతోనే శ్రీదేవి కూతురు తారక్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో జతకట్టడం నిజంగా అదృష్టం అని చెప్పాలి.

కొరటాల శివ చివరిగా ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. దీంతో కొరటాల ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత కూడా ఆచార్య దెబ్బ కొరటాలపై గట్టిగా పడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకం ఉంచాడు. ఆయన చెప్పిన దేవర స్టోరీ నచ్చడంతో ఏడాది పాటు వర్క్ చేసి సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు.

కొరటాల శివ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశారు. కెరియర్ లోనే బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్, గ్లింప్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర మూవీ ఉండబోతోందని అర్ధమైంది. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయంట.

యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 350 కోట్ల వరకు మూవీ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ఆడియో రైట్స్ ని టి-సిరీస్, శాటిలైట్ రైట్స్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఈ నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిలో 50 శాతం రికవరీ అయిపోయిందని టాక్ వస్తోంది.

థీయాట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 110 కోట్ల వేల్యూతో రైట్స్ సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో 27 కోట్లకి రిలీజ్ రైట్స్ డీల్ జరిగిందంట. నాన్ తెలుగు లాంగ్వేజ్ పై 70 కోట్ల వ్యాపారం అయినట్లు సమాచారం. ఓవరాల్ గా 207 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ దేవర మూవీపైన జరిగింది. నాన్ థియేట్రికల్ఈ ప్లస్ థియేట్రికల్ బిజినెస్ లెక్కన చూసుకుంటే టేబుల్ ప్రాఫిట్ తోనే నిర్మాతలు దేవర చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే కచ్చితంగా సినిమా సాలిడ్ లాభాలు తెచ్చి పెట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.