Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి నుంచే దేవర అరాచకం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర.

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:25 AM GMT
అర్ధరాత్రి నుంచే దేవర అరాచకం..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా దేవర తెరకెక్కుతోంది. ఇప్పటికే దేవర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ మూవీపైన అంచనాలు అమాంతం పెంచేశాయి. అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా దేవరకి మెయిన్ అస్సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దేవర క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ తో అందరిని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళిపోతాడని భావిస్తున్నారు.

కొరటాల శివ ఈ సారి సోషల్ మెసేజ్ పక్కన పెట్టి ప్యూర్ గూస్ బాంబ్స్ కథతో దేవర చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. తెరపై అరాచకం హై లెవల్ లో ఉంటుందని ఇప్పటికే స్టోరీలైన్ గురించి కొరటాల చూచాయగా చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి మూవీ ప్రమోషన్స్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉందంట.

ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కంటెంట్ ని బలంగా జనాల్లోకి పంపించాలని భావిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ దేవర చిత్రంలో నటించిన నేపథ్యంలో బాలీవుడ్ లో వారి ద్వారా మూవీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది.

అందుకే దేవర మూవీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర మూవీ అరాచకం సెప్టెంబర్ 27న మిడ్ నైట్ షోలతోనే థియేటర్స్ లో మొదలవుతుందని తెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. అర్ధరాత్రి 1:08 గంటలకి దేవర మొదటి షో థియేటర్స్ లో మొదలవుతుందంట.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవర మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. మరో నెల రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసే దేవర సునామి వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా పోస్టులు పెడుతున్నారు. కల్కి 2898ఏడీ తర్వాత దేవర మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తోనే రిలీజ్ కాబోతోంది. మరి ఈ నెంబర్ ని దేవర ఎంత వరకు అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.