దేవర వాయిదా.. అయినా కొరటాల గ్రేటే..
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2024 5:36 AM GMTమ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అదిరిపోవడంతో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై బజ్ కూడా నెక్స్ట్ లెవెల్‍లో ఉంది.
అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ విడుదల వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ కోసం అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని సమాచారం. మరోవైపు, ఏపీలో ఎన్నికలు కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని భావించిన దేవర టీమ్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారట.
కొత్త రిలీజ్ డేట్ కోసం ఆలోచిస్తున్నారట. దేవర విజువల్స్ విషయంలో మేకర్స్ అసలు రాజీ పడడం లేదని తెలుస్తోంది. దీంతో రిలీజ్ ఆలస్యమైన పర్వాలేదని మూవీ టీమ్ భావిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆశగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల శివపై నిందలు వేస్తున్నారు. తారక్ విలువైన సమయాన్ని కొరటాల వేస్ట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
అయితే చిరంజీవి ఆచార్య మూవీతో కొరటాలకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అందుకే ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న దేవర సినిమాపై అందరి దృష్టి ఉంది. కొరటాల కూడా కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తో దేవర కోసం వర్క్ చేస్తున్నారట. అయితే రిలీజ్ వాయిదా పడినా.. టైమ్ ఎక్కువగా ఉండడం వల్ల కొరటాల నుంచి బెస్ట్ ఔట్ పుట్ ఆశించొచ్చని సినీ పండితులు చెబుతున్నారు. భారీ వీఎఫ్ ఎక్స్ ఉన్న చిత్రం.. ఏడాదిలోపే పూర్తి చేయడం గ్రేట్ అని అంటున్నారు. ఫ్యాన్స్ కాస్త ఓపిగ్గా ఎదురుచూడాలని సూచిస్తున్నారు. కుదిరితే ఇదే ఏడాది జూన్ లో విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, మురళీ శర్మ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ కావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ నిర్ణయించుకుంది. దేవర చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉండనుంది.