Begin typing your search above and press return to search.

అనుకున్నట్లే అంతా.. దేవర ఆ డేటుకే..

ఇప్పుడు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పవర్ పుల్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   13 Jun 2024 5:36 PM GMT
అనుకున్నట్లే అంతా.. దేవర ఆ డేటుకే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పోస్ట్ పోన్.. జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రీ పోన్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. పవన్ ఏపీ పాలిటిక్స్ లో బిజీ గా ఉండడంతో ఓజీ లేట్ అవుతుందని, దేవర ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయిపోవడంతో ముందే వచ్చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. ఓజీ విషయం పక్కన పెడితే.. దేవర పార్ట్ -1 మాత్రం ముందే వచ్చేస్తోంది.

మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. వాస్తవానికి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల దసరా స్పెషల్ గా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పవర్ పుల్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు మేకర్స్. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నారు.

ఇక మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ వేరే లెవెల్ లో ఉంది. సముద్రం ఒడ్డున యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ పోజులో అదిరిపోయేలా కనిపిస్తున్నారు. శత్రువులను ఊచకోత కోస్తున్నట్లుగా పోస్టర్‌ ను అద్భుతంగా డిజైన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. అయితే దేవర ప్రీ పోన్ తో పవన్ ఓజీ విడుదల వాయిదా దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్ 27న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన రాగా.. ఆ మూవీ కూడా పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు టాక్.

దేవర మూవీ విషయానికి వస్తే.. తీర ప్రాంత నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవా చుట్టుపక్క ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల తన పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న తారక్.. హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోకి ఈ సినిమాతోనే అడుగుపెడుతోంది అమ్మడు. సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ కాగా.. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.