Begin typing your search above and press return to search.

దేవర : పాన్‌ ఇండియాకి నెల రోజులు సరిపోతాయా?

సినిమా ప్రమోషన్‌ ఇంకా షురూ అవ్వక పోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 10:30 PM GMT
దేవర : పాన్‌ ఇండియాకి నెల రోజులు సరిపోతాయా?
X

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఉత్తర భారతంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ దక్కింది. అందుకే ప్రస్తుతం రూపొందిస్తున్న దేవర సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నారు. దేవర 1 ను సెప్టెంబర్ 27, 2024 విడుదల చేయబోతున్నారు.

దేవర 1 విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్‌ ఇంకా షురూ అవ్వక పోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కొరటాల శివను ఉద్దేశించి చాలా మంది దేవర ప్రమోషన్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దేవర సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం. కానీ పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించాలి అంటే మాత్రం కచ్చితంగా భారీ ప్రమోషన్ అవసరం.

ఆర్ఆర్ఆర్‌ సినిమాను రాజమౌళి ఏ స్థాయిలో ప్రమోట్‌ చేశాడో అదే విధంగా ఉత్తర భారతంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేవర సినిమాకు క్రేజ్ క్రియేట్‌ అవుతుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌ సినిమాలకు ఉత్తర భారతంలో మంచి డిమాండ్ ఉంది. కనుక బాగా పబ్లిసిటీ చేసి అక్కడ భారీ ఎత్తున విడుదల చేస్తే వందల కోట్ల వసూళ్లు సాధించడం పెద్ద కష్టం ఏమీ కాదు అనే అభిప్రాయం ను సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

విడుదల తేదీ కి ఇంకా నెల సమయం మాత్రమే ఉంది. ఇంకా షూటింగ్‌ తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతోంది. ఇలాంటి సమయంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్ చేయడం సాధ్యమేనా, అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అయ్యే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం తక్కువ సమయంలో సాధ్యం అయ్యేనా, అసలు ఈ నెల రోజులు ఎలా ప్రమోషన్ కి సరిపోతుంది అంటూ నెటిజన్లు తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో అయినా ఎన్టీఆర్‌ దేవర ప్రమోషన్ ను మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.