Begin typing your search above and press return to search.

అంతా 'దేవర' మంచికే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:03 AM GMT
అంతా దేవర మంచికే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న మూవీ కావడంతో భారీ హైప్ నెలకొని ఉంది.

కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ కాస్తా ముందుకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఓజీ మూవీ వాయిదా పడటంతో ఆ డేట్ ని దేవర కన్ఫర్మ్ చేసుకుంది. రిలీజ్ విషయంలో ముందుకి రావడంతో దేవర సినిమా బిజినెస్ కూడా పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

400 నుంచి 450 కోట్ల వరకు ఈ సినిమాపై బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిస్టిబ్యూటర్స్ కూడా రైట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి ముందుకొస్తున్నారంట. ముందు అనుకున్నదానికంటే 50 కోట్లు అదనంగా ఈ సినిమాకి థీయాట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.

దేవర మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ తో క్రేజ్ వచ్చిన సోలోగా తారక్ ఇమేజ్ ని నిలబెట్టే సినిమా దేవర కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ మూవీ యాక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందంట.

నెక్స్ట్ షెడ్యూల్ థాయ్ లాండ్ లో జరగబోతోందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్, తారక్ మీద ఓ సాంగ్ ని చిత్రీకరించనున్నారంట. దీంతో ఆల్ మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందనే మాట వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతని లుక్, ఆహార్యం ఇప్పటికే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపొయింది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోయే దేవర మూవీ ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.