Begin typing your search above and press return to search.

దేవర కోసం మరో శత్రువు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి అతి త్వరలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవర

By:  Tupaki Desk   |   15 July 2024 9:13 AM GMT
దేవర కోసం మరో శత్రువు!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి అతి త్వరలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవర. ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో పీరియాడికల్ జోనర్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది.

దేవర మూవీపై ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. తారక్ ఈ మూవీ కంప్లీట్ చేసుకొని వార్ 2 షూటింగ్ లో నెక్స్ట్ మంత్ జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగష్టు నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనే మాట వినిపిస్తోంది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాబోతున్నది పార్ట్ 1గా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు.

ఇక పార్ట్ 2 సినిమా కూడా మొదటి పార్ట్ కంటే పవర్ ఫుల్ గా ఎక్కువ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉంటుందనే మాట వినిపిస్తోంది. అందుకే పార్ట్ 2 కోసం కొరటాల శివ మరో విలన్ కోసం సెర్చ్ చేస్తున్నారంట. ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ని సంప్రదిస్తున్నట్లు టాక్. ఇప్పటికే బాబీ డియోల్ యానిమల్ సినిమాలో ప్రతినాయకుడిగా అదరగొట్టాడు. అలాగే హరిహర వీరమల్లు, NBK109 సినిమాలలో బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పుడు దేవర పార్ట్ 2 కోసం అతన్ని కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. కొరటాల దేవర పార్ట్ 2కి సంబంధించి కొన్ని సీన్స్ ని షూట్ చేసాడంట. ప్రతినాయకుడి క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యాక మిగిలిన షూటింగ్ చేయాలని అనుకుంటున్నారంట. అయితే తారక్ మాత్రం వార్ 2 కంప్లీట్ చేసి తరువాత వెంటనే డ్రాగన్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత మరల దేవర పార్ట్ 2కోసం డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉందంట. దేవర పార్ట్ 1 రిలీజ్ తర్వాతనే పార్ట్ 2 షూటింగ్ పై స్పష్టత రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందంట. దేవరని ప్రేమించే అమ్మాయి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతోంది. అయితే ఆమె పాత్రకి మరో వేరియేషన్ ని కథలో సడెన్ ట్విస్ట్ గా కొరటాల శివ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.