Begin typing your search above and press return to search.

దేవర బిజినెస్.. వాటికంటే కంటే తక్కువే..

అయితే నిజంగా దేవర సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుందా లేదా అనే విషయంలో మాత్రం ఊహించని సందేహాలు కలుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 April 2024 11:21 AM GMT
దేవర బిజినెస్.. వాటికంటే కంటే తక్కువే..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాటలో వారికంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి హీరోల పైనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో చేస్తున్న రిస్కు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.

ఎందుకంటే మిగతా హీరోలు అందరూ కూడా ఫామ్ లో ఉన్న దర్శకులతో చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దారుణమైన డిజాస్టర్ అందుకున్న ఆచార్య దర్శకుడు కొరటాల శివతో వర్క్ చేస్తున్నాడు. నిజంగా డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఇంతకీ దేవర బిజినెస్ వ్యవహారాలు ఎలా కొనసాగుతున్నాయి అనే విషయంలో చాలా రోజులుగా అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి.

నిర్మాత కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బిజినెస్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజంగా దేవర సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుందా లేదా అనే విషయంలో మాత్రం ఊహించని సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం మిగతా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు ఉన్నంత డీల్స్ కూడా దేవర సినిమాకు సెట్ కావడం లేదని తెలుస్తోంది.

అందుకు కొరటాల శివ కూడా ఒక కారణం. మెగాస్టార్ చిరంజీవి తో అతను చేసిన ఆచార్య సినిమా చాలా దారుణమైన నష్టాలను కలిగించింది. ఆర్థికంగా కూడా కొరటాల శివ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకే దేవర సినిమా బిజినెస్ వ్యవహారాలలో అసలు ఏమాత్రం తలదూర్చడం లేదు. ఇక దేవర సినిమా బిజినెస్ డీల్స్ పుష్ప 2- కల్కి సినిమాల కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఇప్పటివరకు మంచి పాజిటివ్ బజ్ ఇచ్చే విధంగా అప్డేట్స్ అయితే రాలేదు. ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా ఎక్కువ రోజులు హడావిడి చేయలేకపోయింది. ఇక పోస్టర్స్ కూడా వైరల్ అవ్వలేదు. సినిమాలో జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాలీవుడ్లో సైతం పెద్దగా సౌండ్ అయితే క్రియేట్ చేయలేదు. ఎన్టీఆర్ కు అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కానీ సినిమా కంటెంట్ తో కూడా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేస్తేనే బిజినెస్ లో టేబుల్ ప్రాఫిట్స్ అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి కరణ్ జోహార్ ను లైన్ లోకి తీసుకురావడం హిందీ మార్కెట్లో కలిసొచ్చే అంశమే. ఇక బిజినెస్ డీల్స్ అయితే పుష్ప రాజ్ ప్రభాస్ కల్కిల కంటే కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇకపై జరిగిన పొరపాట్లను పట్టించుకోకుండా దేవర మేకర్స్ రాబోయే రోజుల్లో మంచి అప్డేట్స్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనిరుధ్ కూడా మంచి మ్యూజిక్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. మరి రాబోయే రోజుల్లో దేవర మేకర్స్ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.