Begin typing your search above and press return to search.

దేవర.. నీ దారెటు?

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ పాన్ ఇండియా లెవల్ లో చేస్తోన్న మూవీ దేవర షూటింగ్ సగానికి పైగా ఫినిష్ అయ్యింది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 7:58 AM GMT
దేవర.. నీ దారెటు?
X

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ పాన్ ఇండియా లెవల్ లో చేస్తోన్న మూవీ దేవర షూటింగ్ సగానికి పైగా ఫినిష్ అయ్యింది. కొరటాల శివ ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా పూర్తి చేయాల్సిన షూటింగ్ చాలా ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మూవీలో ప్రతినాయకుడిగా ఉన్న సైఫ్ అలీఖాన్ చేతి గాయం కారణంగా నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంది.

ఈ పరిస్థితిలో షూటింగ్ ఇప్పట్లో పూర్తి కావడం కష్టం అనే మాట వినిపిస్తోంది. దీంతో ఏప్రిల్ 5 అనుకుంటున్న రిలీజ్ డేట్ ని వాయిదా వేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఒక వేళ ఏప్రిల్ 5న రిలీజ్ చేయడం కుదరకపోతే నెక్స్ట్ డేట్ ఎప్పుడనేది దేవర టీమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ చేతికి రావడానికి జూన్ లేదా జులై పెట్టొచ్చని టాక్.

ఈ నేపథ్యంలో ఆగష్టులో రిలీజ్ చేద్దామని అనుకుంటే అదే నెలలో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రావొచ్చు. ఆ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే దేవరకి ఆగష్టు 15 మంచి ఛాయస్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ పుష్ప ది రూల్ అనుకున్న సమయానికి రిలీజ్ అయితే సెప్టెంబర్ లో దేవర రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి.

ఆ నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నారు. శంకర్ మొత్తం కంప్లీట్ చేసి అవుట్ ఫుట్ రెడీ చేసి క్లారిటీ ఇస్తే దిల్ రాజు ప్రొసీడ్ అయిపోతారు. ఒక వేళ డిసెంబర్ సాధ్యం కాకుంటే నవంబర్, డిసెంబర్ లో నెలలు ఉన్నాయి. నవంబర్ లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదని వెనక్కి తగ్గొచ్చు. డిసెంబర్ అనుకుంటే ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది.

మరి ఈ డేట్స్ లో దేవర మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎన్ఠీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కావడంతో చాలా ప్లాన్డ్ గా మూవీని రిలీజ్ చేయాల్సి ఉంది. వీకెండ్, ఫెస్టివల్స్ అన్ని కలిసొచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి. లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.