Begin typing your search above and press return to search.

దేవర లెక్క తేలేది అప్పుడేనా?

అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే ఏప్రిల్ 5కి రావాల్సిన మూవీనే. కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 3:47 AM GMT
దేవర లెక్క తేలేది అప్పుడేనా?
X

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. కొరటాల కెరియర్ లో చేస్తోన్న డిఫరెంట్ సబ్జెక్టు మూవీతో పాటు కంప్లీట్ యాక్షన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ స్క్రిప్ట్ పైన ఏడాది పాటు వర్క్ చేసి సెట్స్ పైకి వెళ్లారు. గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉంటాయంట.

సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని సినిమా ప్రారంభం రోజే కొరటాల శివ ప్రకటించారు. తరువాత చాలా సందర్భాలలో ఇదే రిలీజ్ కి దేవర వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రిలీజ్ డేట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే ఏప్రిల్ 5కి రావాల్సిన మూవీనే. కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. దానికి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఆపరేషన్ కూడా జరగనుందంట. ఆ గాయం నుంచి కోలుకొని రావడానికి కనీసం నెల రోజులకి పైనే సమయం పడుతుంది. అతను వస్తేగాని షూటింగ్ కంప్లీట్ కాదు. ఈ కారణంగానే మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినట్లే తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ ని దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ కోసం ఉపయోగించుకుంటున్నారు.

అయితే దేవర మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ ని ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశ్యంలో కొరటాల లేరంట. మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే రిలీజ్ డేట్ ప్రకటించాలని ఫిక్స్ అయ్యారంట. తొందరపడి ముందుగా మరో డేట్ ప్రకటించి ఆ టైంకి రిలీజ్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుందని భావిస్తున్నారు.

అందుకే పక్కా క్లారిటీతోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి అవుట్ ఫుట్ ఎప్పటికి సిద్ధం అవుతుందనేది అంచనాకి వచ్చి రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.