Begin typing your search above and press return to search.

దేవర.. ఎంత మంచి టైమింగ్ అంటే..

భారీ బడ్జెట్ తో కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో సిద్ధమవుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని ఇప్పటికే కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:48 AM GMT
దేవర.. ఎంత మంచి టైమింగ్ అంటే..
X

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. భారీ బడ్జెట్ తో కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో సిద్ధమవుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని ఇప్పటికే కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు. జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ ఆలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయుడిగా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

స్టార్ క్యాస్టింగ్ ని ఈ సినిమా కోసం కొరటాల శివ ఎంపిక చేశాడు. ఓ ఐలాండ్ నేపథ్యంలో సినిమా కథ మొత్తం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అలాగే యాక్షన్ ప్యాక్డ్ స్టొరీగా దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక దేవర పార్ట్ 1 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు.

సినిమాపై తారక్ ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. పవర్ ఫుల్ క్యారెక్టర్ కావడంతో ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ని ఆశిస్తున్నారు. ఇక ఈ రిలీజ్ డేట్ తారక్ కి భాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి ఫెస్టివల్స్ వరుసగా వస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్ అంతా కూడా సినిమా చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు.

ఇక ఏప్రిల్ 5న తారక్ కి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుందని అనుకున్నారు కాని ఎన్నికల హడావిడి, రాజకీయాల కారణంగా షూటింగ్ సాధ్యం కావడం లేదు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమాలు పవన్ కంప్లీట్ చేయనున్నారు. మెగాస్టార్, కళ్యాణ్ కృష్ణ మూవీ ఉంటుందని అనుకున్న అది కాస్తా క్యాన్సిల్ అయ్యింది.

పుష్ప మూవీ రిలీ ఆగష్టు లోకి వెళ్ళిపోయింది. దీంతో ఇంకే పెద్ద హీరో మూవీ పోటీలో లేదు. అలాగే టైర్ 2 హీరోలైన విజయ్ దేవరకొండ, చైతన్య లాంటి హీరోల సినిమాలు కూడా ఆ టైంలో రావడం లేదు. దేవర సినిమాకి ఈ ఫెస్టివల్ సీజన్ భాగా కలిసొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.