Begin typing your search above and press return to search.

దేవర గ్లింప్స్.. ఇది భైరా వేట!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ముందుగానే దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 11:08 AM GMT
దేవర గ్లింప్స్.. ఇది భైరా వేట!
X

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ముందుగానే దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సైఫ్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా హైలెట్ చేశారు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంచనాలు గట్టిగానే పెరుగుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ ఇప్పటికే ఒక పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.


ఇక అంతటి హీరోను ఎదుర్కోవాలి అంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ను చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ భైరా పాత్ర కూడా చాలా కఠినంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. నేడు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. అతని చూపుల్లోనే ఒక సైకోతనం కనిపిస్తోంది. ఒక తెలియని ప్రపంచంలోకి దర్శకుడు కొరటాల శివ ఆడియన్స్ ను తీసుకువెళ్లబోతున్నట్లుగా ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక బైరా క్యారెక్టర్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మరొక సామ్రాజ్యంపై కూడా కన్నేస్తాడు అని అర్థమవుతుంది. ఇక అతను ఎదుర్కోవడానికి దేవర ఏ విధంగా అడుగులు వేశాడు అనేది సినిమాలో మరొక మేజర్ ఎలిమెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భైరా వేట మొదలుపెడితే మామూలుగా ఉండదు అనేలా టీజర్ లో హైలైట్ చేశారు. బైరా క్యారెక్టర్ చాలా ఎలిమెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

అతను భయపెట్టడం ఖాయమని కూడా అనిపిస్తోంది. ఈ క్యారెక్టర్ ను దేవర ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది సినిమాలో చూడాలి అనే ఆసక్తి కలుగుతోంది. ఇక ఈ సినిమాల్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తంగా అనే క్యారెక్టర్ లో కనిపించబోతోంది. రీసెంట్ గా వచ్చిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడా బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ టీజర్ కూడా దేవర సినిమాకు నార్త్ స్టేట్స్ లో హైప్ పెంచే అవకాశం ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.