దేవర సెకండ్ సింగిల్… ప్యూర్ మెలోడీ ట్రీట్
చుట్టమల్లే చుట్టేసింది తుంటరి చూపు' అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ దేవరతో తో ప్రేమలో పడ్డ తంగం క్యారెక్టర్ విరహవేదనని రిప్రజెంట్ చేసే విధంగా ఉండటం విశేషం.
By: Tupaki Desk | 5 Aug 2024 12:33 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న దేవర మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర మూవీ థియేటర్స్ లోకి గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోంది.
ఫస్ట్ వచ్చిన దేవర మూవీ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ యాక్షన్ ఎలివేషన్ తోనే ఆ గ్లింప్స్ ని డిజైన్ చేసి ప్రేక్షకులలో దేవర సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ గా దేవర టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. దీనికి పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చింది. దేవర క్యారెక్టర్ ఎలివేషన్ తో ఫస్ట్ సింగిల్ ఉంటుంది. వెస్ట్రన్ టచ్ తో అనిరుద్ ఈ సాంగ్ ని ఆలపించారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర సెకండ్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీని లాంచ్ చేశారు. 'చుట్టమల్లే చుట్టేసింది తుంటరి చూపు' అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ దేవరతో తో ప్రేమలో పడ్డ తంగం క్యారెక్టర్ విరహవేదనని రిప్రజెంట్ చేసే విధంగా ఉండటం విశేషం. ప్యూర్ మెలోడీ ట్రీట్ లా సాంగ్ ఉంది. శిల్పారావు ఈ సాంగ్ ని ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రచించారు. అలాగే ఈ సాంగ్ ని సముద్ర తీరంలో చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్లు విజువలైజేషన్ చూస్తుంటే తెలుస్తోంది.
జాన్వీ కపూర్ అందాన్ని కూడా సాంగ్ లో ఆధ్యంతం అద్భుతంగా ఆవిష్కరించారు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాంగ్ మొత్తం ఉంటుంది. రామజోగయ్య శాస్త్రీ ఈ సాంగ్ ని రాశారు. ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ మెలోడీ సాంగ్ గా ఈ పాట ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్యూర్ తెలుగు లిరిక్స్ తో అమ్మాయి విరహాన్ని, హీరోపైన మొహాన్ని ఎలివేట్ చేసే విధంగా అద్భుతమైన వర్ణనతో రామజోగయ్య శాస్త్రీ పాటని రాయడం విశేషం.
గతంలో వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల ఈ స్థాయిలో విరహగీతాలని రాసేవారు. అదే స్థాయిలో ఈ సాంగ్ కూడా ఉంది. అనిరుద్ రవిచందర్ కూడా అద్భుతమైన సంగీతం ఈ పాటకి అందించారు. కచ్చితంగా సెకండ్ సింగిల్ మూవీపై నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ చేస్తుందనే మాట వినిపిస్తోంది.