Begin typing your search above and press return to search.

అంత ట్రోల్ చేసినా టాప్ 3లో దేవర సాంగ్

దేవర సినిమాకు ప్రమోషన్ డోస్ పెంచే విధంగా మేకర్స్ సాంగ్స్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Aug 2024 4:21 AM GMT
అంత ట్రోల్ చేసినా టాప్ 3లో దేవర సాంగ్
X

దేవర సినిమాకు ప్రమోషన్ డోస్ పెంచే విధంగా మేకర్స్ సాంగ్స్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చుట్టమల్లే.. అంటూ సాగే రెండో పాటను రీసెంట్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. పాట అలా వచ్చిందో లేదో కాపీ అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ విరహగీతం తరహాలో రొమాంటిక్ ఫీల్ తో ఈ సాంగ్ ని ఆవిష్కరించారు. సాంగ్ లో జాన్వీ కపూర్ ని చాలా అందంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో తారక్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గా కూడా ప్రేక్షకులకి గుడ్ ఫీల్ అందించింది. తారక్ ఫ్యాన్స్ అయితే సాంగ్ ని బాగా ఆస్వాదిస్తున్నారు. జాన్వీ కపూర్ కి టాలీవుడ్ ఎంట్రీ మూవీలోనే అదిరిపోయే సాంగ్ డెబ్యూ లభించిందనే మాట వినిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రీ అందించిన లిరిక్స్, అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులని కట్టిపడేస్తోంది. ఈ కారణంగా దేవర ఫస్ట్ సింగిల్ కంటే సెకండ్ సింగిల్ రికార్డ్ స్థాయిలో వ్యూవ్స్ ని సొంతం చేసుకుంది.

చుట్టమల్లే అంటూ సాంగ్ ఈ సాంగ్ టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూవ్స్ తెచ్చుకున్న పాటల జాబితాలో టాప్ 3లో నిలిచింది. ఈ సాంగ్ 24 గంటల్లో ఏకంగా 15.68 మిలియన్ వ్యూవ్స్ ని సొంతం చేసుకుంది. దీనికంటే ముందు స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ 17.42 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో ఉంది. సర్కారువారిపాట సినిమాలోని పెన్ని సాంగ్ 16.38 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలోకి దేవర సెకండ్ రావడం విశేషం. దీని తర్వాత సర్కారువారిపాట సినిమాలోని కళావతి సాంగ్ నిలిచింది. ఈ సాంగ్ కి 14.78 మిలియన్ వ్యూవ్స్ 24 గంటల్లో వచ్చాయి. ఐదో స్థానంలో ఉన్న మమ మహేషా సాంగ్ 13.56 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది. మేగ్జిమమ్ 24 గంటల వ్యూస్ పరంగా చూసుకుంటే టాప్ 10లో ఎక్కువ సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్స్ ఉండటం విశేషం.

టాప్ 10 సాంగ్స్ ఈ జాబితాలోకి యంగ్ ఎన్టీఆర్ కూడా చుట్టమల్లే సాంగ్ తో వచ్చాడు. సాంగ్ కి రికార్డ్ స్థాయిలో వ్యూవ్స్ వచ్చిన కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతోంది. కొరటాల శివ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో సోప్ యాడ్ షూట్ చేసారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అనిరుద్ ఈ సాంగ్ ట్యూన్ కాపీ చేశాడంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

దమ్ మసాలా - 17.42M

పెన్ని సాంగ్ - 16.38M

చుట్టమల్లే - 15.68M*

కళావతి - 14.78M

మమ మహేషా - 13.56M

ఊ అంటావా ఊఊ అంటావా - 12.39M

సూసేకి అగ్గిపుల్ల - 10.97M

పుష్ప పుష్ప - 10.38M

లాలా భీమ్లా - 10.20M

సనా కష్టం - 10.16M