Begin typing your search above and press return to search.

దేవర: సముద్రంలో షార్క్ ఫైట్?

సముద్రం లో జూనియర్ ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ చేసే హై వోల్టేజ్ సిన్ కూడా ప్రేక్షకుల మతి పోగొట్టేసేలా ఉంటుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 6:41 AM GMT
దేవర: సముద్రంలో షార్క్ ఫైట్?
X

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం విశేషం.

అసలు మొదట సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే చర్చల దశలోనే చాలా మార్పులు చేశారు. అక్కడే కంటెంట్ చాలా బలంగా ఉండాలి అని కొరటాల శివను తారక్ చాలా పదునుగా మార్చాడు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు యాక్షన్ సన్నివేషన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తున్న ఏకాగ్రతకు అందరూ షాక్ అవుతున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన సెట్ లో హాలీవుడ్ విజువల్ లో ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ తో కలిసి కొన్ని కీలకమైన యాక్షన్స్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఒక యాక్షన్ ఫైట్ కూడా సినిమాకు మొత్తానికి హైలైట్ కాబోతుందట. సముద్రం లో జూనియర్ ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ చేసే హై వోల్టేజ్ సిన్ కూడా ప్రేక్షకుల మతి పోగొట్టేసేలా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన షూట్ లో కూడా షార్క్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లు సమాచారం.

హై విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందే ఈ సన్నివేశం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని తెలుస్తోంది. గతంలో చత్రపతి సినిమాలో ప్రభాస్ రాజమౌళి సొర చేపతో ఏ విధంగా ఒక సినిమాను హైలెట్ చేశాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు కొరటాల శివ, తారక్ ను షార్క్ తో అంతకుమించి అనేలా ప్రజెంట్ చేయబోతున్నాడట. ఇక ఈ కీలకమైన ఘట్టం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఈక్వల్ గా దర్శకుడు తో పాటు ఏకగ్రత వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకటికి రెండుసార్లు ప్రతి షాట్ చూస్తూ పర్ఫెక్ట్ గా రాకపోతే మాత్రం మరోసారి చేయడానికి కూడా వెనుకాడడం లేదట. కొరటాల శివ కొన్నిసార్లు షాట్ ఓకే అని చెప్పినప్పటికీ కూడా తారక్ కు నచ్చకపోతే మాత్రం మళ్లీ దాన్ని రీశుట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు పర్ఫెక్షన్ విషయంలో తారక్ కూడా దర్శకుడి తో సమానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం.