Begin typing your search above and press return to search.

గోవా ప్రత్యేక‌త ఏంటి `దేవ‌ర‌`?

తాజాగా కొత్త షెడ్యూల్ కూడా మ‌ళ్లీ గోవాలోనే ప్రారంభ‌మైంది. ఇందులో తార‌క్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించనున్నారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 4:40 AM GMT
గోవా ప్రత్యేక‌త ఏంటి `దేవ‌ర‌`?
X

`దేవ‌ర` షూటింగ్ మొద‌లైన నాటి నుంచి షూటింగ్ అంతా ఎక్క‌డ జ‌రిగిందంటే? వినిపించే రెండే రెండు లొకేష‌న్ ప్రాంతాలు హైద‌రాబాద్, గోవా అన్న‌ది తెలిసిందే. మ‌రికొన్ని స‌న్నివేశాలు క‌ర్ణాక‌ట తీర ప్రాంతంలో చిత్రీక‌రించారు. ఈ మూడు త‌ప్ప దేవ‌ర‌కి సంబంధించి ఇంకెక్క‌డా షూటింగ్ జ‌ర‌గ‌లేదు. విదేశాల‌కు వెళ్ల‌డం గానీ, తెలంగాణ ప‌రిస‌రాల్లో ఇంకెక్కాడా షూటింగ్ నిర్వ‌హించ‌డం గానీ ఏం జ‌ర‌గ‌లేదు. ఇక ఏపీ ప‌రంగా చూస్తే రాష్ట్రం ఊసేలేదు. చిత్రీక‌ర‌ణ కూడా క్లైమాక్స్ కి చేరుకుంది.

తాజాగా కొత్త షెడ్యూల్ కూడా మ‌ళ్లీ గోవాలోనే ప్రారంభ‌మైంది. ఇందులో తార‌క్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించనున్నారు. వ‌చ్చే వారాంతానికి ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. దేవ‌ర తీరు చూస్తుంటే హైదరాబాద్ గా కంటే కూడా ఎక్కువ‌గా షూటింగ్ గోవాలోనే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమా తొలి షెడ్యూల్ గోవాలోనే మొద‌లైంది. అక్క‌డ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత హైద‌రాబాద్ ఆర్ ఎఫ్ సీలో సెట్లు వేసి ఎక్కువ‌గా షూటింగ్ చేసారు.

సీ బ్యాక్ డ్రాప్ స‌న్నివేశాల కోసం బ్లూ మ్యాట్ వేసి చిత్రీక‌రించారు. అలాగే అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో కూడా కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. మ‌త్స‌కార నేప‌థ్యం ఉన్న స్టోరీ కావ‌డంతో గోవాలోనే 60 శాతం షూటింగ్ నిర్వ‌హించి ఉండొచ్చు. అయితే షూటింగ్ ప‌రంగా ఏపీని ప‌ట్టించుకోక‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 972 కిలోమీట‌ర్ల పొడ‌వున్నతీర‌ప్రాంతం ఏపీ సొంతం. షూటింగ్ కి ఎంతో సౌల‌భ్యం ఇక్క‌డ దొరుకుతుంది.

అన్ని ర‌కాల వెసులు బాట్లు ఉన్నాయి. ఎంతో మంది మ‌త్స్స‌కారులు ఏపీలో ఉన్నారు. అన్నింటిని మించి సొంత రాష్ట్రం కూడా. ఇక్క‌డే షూటింగ్ చేస్తే రాష్ట్రానికి సినిమా రూపంలో కొంత ఆదాయం కూడా స‌మ‌కూరుతుంది. కానీ `దేవ‌ర` ఆ ఛాన్స్ తీసుకోలేదు. షూటింగ్ అంతా గోవాకే ప‌రిమితం చేసారు. మ‌రి కాన్సెప్ట్ ఆధారంగా గోవా వెళ్లిల్సి వచ్చిందా? గోవా లొకేష‌న్లు మాత్రమే షూటింగ్ స‌హ‌క‌రించి చేసారా? అన్న‌ది తెలియాలి. ఇంకా `దేవ‌ర` రెండ‌వ భాగం కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.