దేవర.. మళ్ళీ రంగంలోకి దిగేది అప్పుడే..
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
By: Tupaki Desk | 13 Feb 2024 4:33 AM GMTఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పార్ట్ 1 ఏప్రిల్ లో వస్తుందని ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ కి గాయం కావడంతో విరామం తీసుకున్నారు.
అలాగే షూటింగ్ లో ఇంకా కీలక సన్నివేశాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సీజీ కూడా ఆలస్యం అయ్యేలా ఉందంట. ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంటే. ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని టాక్.
ఈ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పైన ఫోకస్ చేయబోతున్నారంట. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాంగ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదని తెలుస్తోంది. అవి కంప్లీట్ అయ్యాక మరో ఒకటి, రెండు షెడ్యూల్స్ లో సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేయడానికి తారక్ సిద్ధంగా ఉన్నారంట. జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.
ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వాలని తారక్ అనుకుంటున్నారు. మార్చి ఆఖరుకి దేవర పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో దేవరపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అంచనాలని ఏ మాత్రం అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
దేవర పార్ట్ 1 కంప్లీట్ అయితే ఎన్టీఆర్ లైన్ అప్ లో వార్ 2 మూవీ ఉంటుంది, దాని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవర సీక్వెల్ కూడా ఉంది. వీటి తర్వాత స్టార్ డైరెక్టర్స్ చాలా మంది తారక్ తో మూవీ కోసం లైన్ కట్టారు.