Begin typing your search above and press return to search.

'దేవర'.. అసలు పాటకు ప్రాబ్లమ్ ఏంటీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Jan 2024 8:17 AM GMT
దేవర.. అసలు పాటకు ప్రాబ్లమ్ ఏంటీ?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'దేవర' కూడా ఒకటి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న 'దేవర పార్ట్-1' వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.

సినిమా రిలీజ్ కి మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటివరకు దేవర నుంచి అనుకున్న స్థాయిలో అప్డేట్స్ అయితే రావడం లేదు. మామూలుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తుంటారు. కానీ ఈ విషయంలో దేవర మూవీ టీం వెనుకంజలో ఉంది. గ్లింప్స్ వీడియో తప్పితే ఇప్పటివరకు మరో అప్డేట్ లేదు. నిజానికి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాలి.

కానీ ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి అప్డేట్ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఆలస్యం చేయడం వల్లే ఫస్ట్ సింగిల్ లేట్ అవుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. అనిరుద్ ఓ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడంటే సాంగ్స్ కంపోజిషన్ కి చాలా తక్కువ టైం తీసుకుంటాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ దేవర నుంచి ఇప్పటివరకు ఒక్క పాట కూడా రిలీజ్ కాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

మరి ఇక్కడ నిజంగానే అనిరుద్ ఆలస్యం చేస్తున్నాడా? లేక కొరటాల శివ టైం తీసుకుంటున్నాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గత కొద్ది రోజులుగా దేవర రిలీజ్ డేట్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడం, దానికి తోడు ఏపీ ఎలక్షన్స్ కూడా రాబోతుండడంతో దేవర రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

రిలీజ్ డేట్ ని పక్కన పెడితే సినిమా నుంచి కనీసం అప్డేట్స్ ఇచ్చినా ఆడియన్స్ లో ఎంతో కొంత హైప్ వస్తుంది. కానీ ఇప్పటిదాకా మేకర్స్ ఇలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నిజంగానే 'దేవర' రిలీజ్ ని పోస్ట్ ఫోన్ చేస్తున్నారేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద దేవర ఫస్ట్ సింగిల్ ఇప్పటిలో ఉండే అవకాశం అయితే లేదని అంటున్నారు.