Begin typing your search above and press return to search.

దేవర.. ఈ సర్ ప్రైజ్ కూడా గట్టిగానే..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర.

By:  Tupaki Desk   |   14 Jun 2024 1:30 PM GMT
దేవర.. ఈ సర్ ప్రైజ్ కూడా గట్టిగానే..
X

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ. ఇస్తోంది. శ్రీదేవి కూతురుగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతూ ఉండటంతో ఆమెను తంగా అనే పాత్రలో చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందం, ఆకర్షణతో పాటు నటన విషయంలో తల్లిని గుర్తుచేస్తుందా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఓ పల్లె యువతి పాత్రలో కనిపించబోతోంది.

దేవర మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందంట. యాక్షన్ సీక్వెన్స్ అన్ని కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా గోవాలో కొన్ని మారుమూల ప్రాంతాలలో దేవర మూవీకి సంబందించిన యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించారంట. నెక్స్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ థాయ్ లాండ్ లో ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించనున్నారంట.

ఈ సాంగ్ మూవీలో చాలా స్పెషల్ గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దేవర టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. దేవర మూవీతో తెలుగులో మ్యూజికల్ గా సక్సెస్ అందుకోవాలని అనిరుద్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారంట. అందుకే అదిరిపోయే సాంగ్స్ ని కంపోజ్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

ఇక ఎన్టీఆర్, జాన్వీ మధ్యలో ఉండే రొమాంటిక్ సాంగ్ విజువల్ ట్రీట్ తో పాటు వినసొంపుగా ఉండబోతున్నట్లు సమాచారం. సాధారణంగా కొరటాల సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ ఉండవు. కానీ ఈసారి ఆయన పూర్తి స్థాయిలో డిఫరెంట్ స్టైల్ లో సాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దేవర మూవీ కంప్లీట్ చేసుకొని తారక్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వార్ 2 భారీ మల్టీ స్టారర్ చిత్రంగా పాన్ ఇండియా రేంజ్ లో రానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే డ్రాగన్ మూవీ షూటింగ్ కూడా రెండు నెలల్లో స్టార్ట్ చేసే అవకాశం ఉందంట.