Begin typing your search above and press return to search.

దేవరకు అలాంటి టచ్.. నిజమైతే అరాచకమే..

కంప్లీట్ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:53 AM GMT
దేవరకు అలాంటి టచ్.. నిజమైతే అరాచకమే..
X

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై రెండు భాగాలుగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. సైఫ్ ఆలీఖాన్ పవర్ ఫుల్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 మెజారిటీ షూటింగ్ పూర్తయ్యింది. సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని ఎగ్జైట్ చేస్తాయనే మాట వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

సినిమాలో మైథలాజికల్ పాయింట్ ని కూడా ఈ సినిమాలో టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే దేవర మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించడం పక్కా అనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన కార్తికేయ 2, కాంతారా సినిమాలు మైథలాజికల్ పాయింట్ తోనే తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే దేవర మూవీలో కూడా అలాంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ టచ్ చేస్తున్నారని తెలియడంతో పక్కా వెయ్యి కోట్ల మూవీ అంటూ తారక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దేవర మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. దేవర మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే తారక్ వార్ 2లో జాయిన్ అవుతాడు. ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.

వార్ 2తో తారక్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో అతని పాత్ర కాస్తా నెగిటివ్ టచ్ తో ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. దేవర సినిమా ప్రమోషన్స్ లోనే వార్ 2 సినిమా గురించి కూడా వచ్చే ఏడాదిలో తారక్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.