Begin typing your search above and press return to search.

దేవర.. సడన్ బ్రేక్

కొరటాల శివ ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా ఓ కొత్త ప్రపంచంలోకి దేవర సినిమాతో తీసుకొని వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 4:18 AM GMT
దేవర.. సడన్ బ్రేక్
X

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రెడీ అవుతోంది. కొరటాల శివ ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా ఓ కొత్త ప్రపంచంలోకి దేవర సినిమాతో తీసుకొని వెళ్తున్నాడు.

ఇప్పటికే మూవీ కంటెంట్ ఎలా ఉండబోతోంది అనేది హింట్ ఇచ్చేశాడు. ఓ ఐలాండ్ నేపథ్యంలో ఫిక్షనల్ ప్లేస్ లో కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ కి సృష్టించినట్లే డిఫరెంట్ ప్రపంచాన్ని కొరటాల శివ దేవర కోసం సృష్టించాడు. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.

గ్యాప్ లేకుండా నిర్విరామంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. షెడ్యూల్ నుంచి షెడ్యూల్ కి టైం తీసుకున్న కేవలం వారం రోజులకి మించి ఎప్పుడు టైం తీసుకోలేదు. అయితే మొదటిసారి మాత్రం కొంత విరామం తీసుకుంటున్నారంట. టీం మొత్తానికి న్యూ ఇయర్ హాలిడే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారంట.

కొత్త సంవత్సర వేడుకలు కూడా అక్కడే చేసుకుంటారంట. ఈ నేపథ్యంలో దేవర షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కి విరామం దొరికినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షెడ్యూల్స్ కారణంగా టీమ్ మొత్తం భాగా అలసిపోయి ఉంటారు. వారందరికీ కొంత ఉపశమనం లభించినట్లు అయ్యింది. ఈ మూవీ షూటింగ్ జనవరిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది పూర్తయిన వెంటనే తారక్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హృతిక్ రోషన్ మీద కీలక ఎపిసోడ్స్ అన్ని చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 మూవీ తెరకెక్కుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో సినిమాని నిర్మిస్తోంది.