Begin typing your search above and press return to search.

దేవర వేట.. గెట్ రెడీ

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కూడా దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 2:45 AM GMT
దేవర వేట.. గెట్ రెడీ
X

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని ఎన్టీఆర్ నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కూడా దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

అయితే దేవర సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి కూడా చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసుకుంటుంది. వీలైనంతవరకు అన్ని భాషల్లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసే విధంగా అప్డేట్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు.

ఇక డిసెంబర్ రెండో వారంలో కూడా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి ఒకే ఒక్క బలమైన టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారు. సింగిల్ లాంగ్వేజ్ లో అందరికీ కమేక్ట్ అయ్యే విధంగా యాక్షన్ టీజర్ విడుదల చేస్తే చాలా బాగుంటుంది అని ఎన్టీఆర్ ముందుగా ఆలోచించినట్లుగా తెలుస్తోంది. అందుకు కొరటాల శివ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక వీలైనంత వరకు డిసెంబర్ సెకండ్ వీక్ లోనే సినిమా రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. తర్వాత మెల్లగా ఒక్కో పాట కూడా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయో అనేదానికన్నా కూడా ఆ మ్యూజిక్ కు జూనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా డాన్స్ చేస్తాడు అనే విషయంపై అందరూ ఎక్కువగా హోప్స్ పెంచుకుంటున్నారు. అనిరుద్ ఎన్టీఆర్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా మ్యూజిక్ పై మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. మార్కెట్లో కూడా ఊహించని ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి.