'దేవర' VFX టీం క్రేజీ అప్‌డేట్
ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
By: Tupaki Desk | 20 Aug 2024 6:53 AM GMTఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు. రెండు పార్ట్ లుగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ పై అంచనాలు భారీగా పెంచారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు మరియు గ్లిమ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి.
తాజాగా ఈ సినిమా కి వీఎఫ్‌ఎక్స్ వర్క్ అందిస్తున్న అల్జాహ్రా స్టూడియో నుంచి వచ్చిన అప్‌డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలి 2, సాహో, ఆర్‌ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలకు వీఎఫ్‌ఎక్స్ అందించిన ఈ కంపెనీ ప్రస్తుతం దేవర సినిమా కోసం వర్క్ చేస్తుంది. ప్రస్తుతం దేవర సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అనే విధంగా బ్లడ్ అండ్ షార్ప్ టీత్ అనే కోట్ ను జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
ప్రస్తుతం దేవర సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. వారి అంచనాలు మరింతగా పెంచే విధంగా వీరి అప్డేట్ ఉందని, కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకంను ఎన్టీఆర్ సన్నిహితులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్తగా పవర్ ఫుల్ పాత్రలో చూడబోతున్నామని ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని దేవర కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ కాస్త ఎక్కువగానే ఈ సినిమాకు ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచే చెబుతూ వస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నాడు. అందుకు గాను వీఎఫ్‌ఎక్స్ కంపెనీ అల్జాహ్రా స్టూడియో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ అందుకోలేక పోయిన జాన్వీ కపూర్ కి ఈ సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దేవర 1 ఫలితం అనుసారం దేవర 2 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.