Begin typing your search above and press return to search.

లైగర్ దెబ్బ కొట్టినా.. ఖుషి గట్టిగానే..

అయితే ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్​ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలిసింది. నాన్​ థియేట్రికల్​ రైట్స్​తోనే మేకర్స్​ ఆల్మోస్ట్​ బడ్జెట్​ను కవర్​ను చేశారట.

By:  Tupaki Desk   |   15 Aug 2023 1:30 AM GMT
లైగర్ దెబ్బ కొట్టినా.. ఖుషి గట్టిగానే..
X

సాధారణంగా ఓ పెద్ద డిజాస్టర్ సినిమా వస్తే.. అది ఆ హీరో-హీరోయిన్-దర్శకుడి నెక్స్ట్​ మూవీ బిజినెస్​పై కాస్త ఎఫెక్ట్​ పడుతుంది. అయితే ఇప్పుడు 'ఖుషి' సినిమా విషయంలో అది పెద్దగా కనపడట్లేదు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ బాగానే జరిగినట్లు సమాచారం అందింది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి.

ది విజయ్ దేవరకొండ 'లైగర్'తో హీరోయిన్ సమంత 'శాకుంతలం'తో దర్శకుడు శివ నిర్వాణ 'టక్ జగదీష్'తో భారీ డిజాస్టర్లను అందుకున్న సంగతి తెలిసిందే. అలా డిజాస్టర్స్ ఇచ్చిన ఈ ముగ్గరి కాంబినేషన్ కలిసి వస్తున్న సినిమానే 'ఖుషి'. ఈ రొమాంటిక్ లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.. నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్​ సూపర్ హిట్​గా నిలవగా.. ట్రైలర్ కూడా పర్వాలేదనిపించేలా మెప్పించింది.

ముఖ్యంగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం హైలైట్​గా నిలిచింది. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్​ సోషల్​మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై బజ్​ బాగానే క్రియేట్ అయింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ వివరాల లెక్కలు బయటకు వస్తున్నాయి.

అయితే ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్​ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలిసింది. నాన్​ థియేట్రికల్​ రైట్స్​తోనే మేకర్స్​ ఆల్మోస్ట్​ బడ్జెట్​ను కవర్​ను చేశారట. ఇప్పుడు థియేట్రికల్​ రైట్స్​ కూడా మంచి బిజినెస్​ అవుతుందని తెలిసింది. కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్​ రైట్స్​ దాదాపు రూ.50కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. అంటే బాగానే జరిగినట్లు అర్థమవుతోంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే ప్రమోషన్స్​లో భాగంగా.. మూవీటీమ్​.. ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్​ను నిర్వహించనున్నారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ HICC కన్వెన్షన్​లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్​ నిర్వహించనున్నారు. ఈ మ్యూజిక్​ కాన్సర్ట్​లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారట.