బన్నీ ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లాడిలా!
తాజాగా బన్నీతో తన స్నేహ బంధం గురించి డీఎస్పీ మరోసారి రివీల్ చేసారు. ' ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. తను మా ఇంటికొచ్చి ఆడుకునేవాడు.
By: Tupaki Desk | 11 Dec 2024 5:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రాక్ స్టార్ దేవి ప్రసాద్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. బన్నీ ఏ సినిమా చేసినా దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి ఉండేలా చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన హీరోగా నటించిన సినిమాలకు ఎక్కువగా పనిచేసింది కూడా డీఎస్పీనే. వాళ్లిద్దరి మధ్యలోకి సుకుమార్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ ముగ్గురు మరింత క్లోజ్ అయ్యారు. 'పుష్ప' విజయంతో డీఎస్పీ పేరు పాన్ ఇండియాలో గట్టిగానే సౌండింగ్ చేసింది.
తాజాగా బన్నీతో తన స్నేహ బంధం గురించి డీఎస్పీ మరోసారి రివీల్ చేసారు. ' ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. తను మా ఇంటికొచ్చి ఆడుకునేవాడు. నేను తన ఇంటికెళ్లి ఆడేవాడిని. బన్నీ ఇప్పుడు చెన్నై వస్తే మా ఇంటికే వస్తాడు. నేను పెద్ద హీరోని..ఇలాగే ఉండాలి అని గిరి గీసుకూని కూర్చోడు. నేను స్టూడియోలో పాటలు రికార్డింగ్ చేస్తుంటే ఆ పాటలకు బన్నీ డాన్సు చేస్తుంటాడు. తన ఎంత ఎదిగినా లోపల ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం అలాగే ఉంది.
'పుష్ప-2' సెట్ లో గంగమ్మ తల్లి అవతారంలో చూస్తే సాక్షాత్తు అమ్మవారే నడిచి వచ్చినట్లు అనిపించింది' అని అన్నారు. బన్నీ-డీఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా మంచి విజయం సాధించినవే. ఆర్య, ఆర్య-2, బన్నీ, జులై, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే, పుష్ప రెండు భాగాలకు దేవి శ్రీనే సంగీతం అందించారు.
'పుష్ప' సినిమాకు గానూ ఇద్దరు జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటోన్న సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ గురించి ఎంతో ఎమోషన్ ల్ గానూ రివీల్ చేసారు. పుష్ప-2కి కూడా జాతీయ అవార్డులు వస్తాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.