బన్నీ నమ్మకాన్ని నిలబెట్టిన దేవీ
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
By: Tupaki Desk | 7 Feb 2025 9:08 AM GMTరాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కానీ గత కొంతకాలంగా దేవీ నుంచి తన రేంజ్ మ్యూజిక్ రావం లేదనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఒక సినిమాకు పని చేస్తున్నాడంటే కచ్ఛితంగా ఆ సినిమా మ్యూజికల్ హిట్ అనే టాక్ వినిపించేది.
కొన్నేళ్లుగా ఆ మాట పెద్దగా వినిపించడం లేదు. ఈ మధ్య అయితే దేవీపై, తన మ్యూజిక్ పై నెగిటివిటీ బాగా పెరిగింది. దానికి తోడు తానెప్పుడు సినిమా చేసినా దేవీతో తప్ప వేరే వారితో ముందుకెళ్లని సుకుమార్ సైతం పుష్ప2 బీజీఎం కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ వంక చూడటంతో దేవీ స్టామినా తగ్గిందని అందరూ అనుకున్నారు.
ఇలాంటి టైమ్ లో దేవీ శ్రీ ప్రసాద్ నుంచి తండేల్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఆడియన్స్ కు తెగ నచ్చేశాయి. బుజ్జితల్లి పాటతో మొదలై, నమో నమః, హైలెస్సా సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చూశాం. తన ట్యూన్స్ తో తండేల్ ను మంచి మ్యూజికల్ ఆల్బమ్ గా నిలబెట్టాడు దేవీ శ్రీ ప్రసాద్.
ఇప్పుడు తండేల్ రిలీజయ్యాక థియేటర్లలో కూడా దేవీ శ్రీ తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడని టాక్ వినిపిస్తుంది. దేవీ తన బీజీఎంతో ప్రతీ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాడట. ఇంకా చెప్పాలంటే తండేల్ కు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బీజీఎం పెద్ద ఎస్సెట్. మంచి ప్రేమ కథ అయిన తండేల్ ను దేవీ తన మ్యూజిక్ తో తర్వాతి స్థాయికి తీసుకెళ్లాడని అందరూ దేవీని ప్రశంసిస్తున్నారు.
అయితే మొదట తండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలా అనుకుంటున్న టైమ్ లో పుష్ప2తో బిజీగా ఉన్నాడని దేవీశ్రీని వద్దనుకున్నానని, కానీ బన్నీ మాత్రం ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాదే కరెక్ట్ అని తండేల్ బాధ్యతను దేవీకి అప్పగించేలా చేశాడని అల్లు అరవింద్ ఆల్రెడీ చెప్పాడు. తండేల్ రిలీజయ్యాక థియేటర్లలో రెస్పాన్స్ చూసి బన్నీ నమ్మకాన్ని దేవీ నిలబెట్టుకున్నాడని అల్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ దేవీని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి తండేల్ తో దేవీ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి.