దేవీశ్రీ పెళ్లిపై బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతేకాదు, మాకు పెళ్లిళ్లై పిల్లలు కూడా పుట్టారు కానీ దేవీ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడని, త్వరలోనే ఆయనకు పెళ్లై పిల్లలు పుట్టాలి.
By: Tupaki Desk | 3 Feb 2025 7:30 PM GMTఎన్నో సినిమాలకు మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ తండేల్ సినిమాకు సంగీతం అందించాడు. తండేల్ నుంచి ఇప్పటికి మూడు పాటలు రిలీజవగా ఆ మూడు పాటలూ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. బుజ్జితల్లి సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో తండేల్ జాతర అనే పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తండేల్ సినిమా ఇంత గొప్పగా రావడానికి, ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడానికి మొదటి కారణం దేవీనే అని, ఆయన్ని ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారని, తమ సినిమాలో కూడా బుజ్జితల్లి ఉందని, మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు కానీ ఆ తల్లి అంటే దేవీ శ్రీ కి కాబోయే భార్య ఎక్కడుందోనని బన్నీ వాస్ ఈ సందర్భంగా అన్నాడు.
అంతేకాదు, మాకు పెళ్లిళ్లై పిల్లలు కూడా పుట్టారు కానీ దేవీ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడని, త్వరలోనే ఆయనకు పెళ్లై పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు కూడా దేవీ లానే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లై మంచి మంచి పాటలు చేయాలని కోరుకుంటున్నట్టు బన్నీ వాస్ తెలిపాడు. దానికి దేవీ స్టేజ్ కింద నుంచే రాసి పెట్టి ఉంటే జరుగుతుందని సైగలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే దేవీ శ్రీ వయసు ఇప్పటికే 45 ఏళ్లు. ఇప్పటికీ దేవీ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణమేంటనేది మాత్రం తెలియదు. అయితే గతంలో దేవీ, హీరోయిన్ ఛార్మీ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి కానీ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు కూడా అన్నారు. మరి బన్నీ వాస్ మాటను దేవీ ఏ మేరకు ఆచరిస్తాడో చూడాలి.