Begin typing your search above and press return to search.

తండేల్.. దేవి కోసమే అందరి వెయిటింగ్

పుష్ప మ్యూజిక్ కి గాను దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. ఇప్పుడు అదే ఊపుతో పుష్ప 2కి సాంగ్స్ సిద్ధం చేశాడు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 8:30 AM GMT
తండేల్.. దేవి కోసమే అందరి వెయిటింగ్
X

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. పుష్ప మూవీ సక్సెస్ తర్వాత అతని పాటలకి ఆల్ ఓవర్ ఇండియాలో ఆదరణ లభిస్తోంది. దేవిశ్రీ కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా కనీసం రెండు, మూడు నెలలు హల్చల్ చేస్తోంది.

పుష్ప మ్యూజిక్ కి గాను దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. ఇప్పుడు అదే ఊపుతో పుష్ప 2కి సాంగ్స్ సిద్ధం చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దేవిశ్రీ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేశాయి. దీంతో పాటు తమిళ్ లో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేసింది. వీటితో పాటు గీతా ఆర్ట్స్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. నాగ చైతన్య మూవీలో రాజు అనే ఫిషర్ మెన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర స్లాంగ్ కూడా నేర్చుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. సినిమా కోసం నాలుగు ఫుల్ సాంగ్స్ ని, రెండు బిట్ సాంగ్స్ ని సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఈ సాంగ్స్ అన్ని కూడా ఒకదానిని మించి ఒకటి ఉంటాయనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దేవిశ్రీ హ్యాండ్ నుంచి వస్తుందంటే కచ్చితంగా సాంగ్స్ సినిమాకి నెక్స్ట్ లెవల్ హైప్ తీసుకురావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు. సాయి పల్లవి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా నటిస్తోన్న నేపథ్యంలో కచ్చితంగా మంచి డాన్స్ బేస్డ్ సాంగ్ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం రెడీ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ వస్తే అప్పుడు సాంగ్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే తండేలో మరో బెస్ట్ ఆల్బమ్ గా నిలిచేలా దేవి ట్యూన్స్ సెట్ చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్ పై అప్డేట్ రానుంది.